News February 15, 2025
‘లైలా’ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

విశ్వక్ సేన్ నటించిన ‘లైలా’ మూవీకి తొలి రోజు రూ.1.25 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. సినిమాకు పూర్తిగా నెగటివ్ టాక్ రావడంతో వీకెండ్ అయినప్పటికీ బుకింగ్స్ ఏమాత్రం లేవని పేర్కొన్నాయి. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వైసీపీ టార్గెట్‌గా నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలతో దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. సినిమాలోనూ విషయం లేకపోవడంతో ఎవరూ ఆసక్తి చూపడం లేదని అంటున్నాయి.
Similar News
News April 16, 2026
మెదక్: రైతు బంధు నిలిపివేయడంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

రైతులకు రావాల్సిన రైతు బంధు నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నార్సింగి మండలం శంకాపురం గ్రామానికి చెందిన పిటిషనర్ల భూములకు సంబంధించి రైతు బంధు మొత్తాలు నిలిపివేయడం, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం చట్టవిరుద్ధమని ప్రాథమికంగా గుర్తించిన న్యాయస్థానం, కలెక్టర్ సహా సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
News April 16, 2026
ముంబై బ్యాటింగ్.. రోహిత్ శర్మ దూరం

ముంబైతో మ్యాచులో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ ఈ మ్యాచుకు దూరం అయ్యారు. డికాక్ జట్టులోకి వచ్చారు.
ముంబై: డికాక్, రికెల్టన్, సూర్య, తిలక్, నమన్ ధీర్, హార్దిక్ (C), రూథర్‌ఫోర్డ్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, మయాంక్ రావత్, బుమ్రా.
పంజాబ్: ప్రభ్‌సిమ్రాన్, ప్రియాన్ష్, శ్రేయస్(C), కనోలి, శశాంక్ సింగ్, స్టాయినిస్, యాన్సెన్, బార్ట్‌లెట్, వైశాక్, అర్ష్‌దీప్, చాహల్.
News April 16, 2026
బెంగాల్ ‘మాజీ ఓటర్ల’కు రిలీఫ్?

బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ SIRతో ఓట్లు కోల్పోయిన వారికి ఊరట లభించే అవకాశం ఉంది. ఎన్నికల జాబితాలో పేరు చేర్చేందుకు అప్పీలేట్ ట్రైబ్యునల్స్ నుంచి క్లియరెన్స్ తీసుకున్న వారు ఓటు వేయొచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఎన్నికలకు రెండు రోజుల ముందే ఈ క్లియరెన్స్ వచ్చి జాబితాలో లిస్ట్ అయ్యి ఉండాలని స్పష్టం చేసింది. కాగా SIRతో బెంగాల్‌లో దాదాపు 91లక్షల ఓట్లు పోయాయి.


