News July 4, 2024
ఏం మాట్లాడుతున్నారండి జగన్ గారు: నాగబాబు

AP: పిన్నెల్లికి కోపమొచ్చి EVM పగులగొట్టారన్న జగన్ వ్యాఖ్యలపై జనసేన నేత నాగబాబు సెటైర్లు వేశారు. ‘ఏం మాట్లాడుతున్నారండి బాబు? పోలింగ్ కేంద్రంలో నిజంగా అన్యాయం జరిగితే అక్కడ పోలీసులు, ఎన్నికల సిబ్బంది లేరా? మిడిమిడి జ్ఞానంతో మితిమీరిన ఎచ్చులకి పోయినందుకే 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇకనైనా పరిణతితో మాట్లాడకపోతే ఈసారి సింగిల్ డిజిట్ కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News December 12, 2025
అన్ని మతాలకు వాస్తు వర్తిస్తుందా?

వాస్తు ఓ మతానికే పరిమితం కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘వాస్తు పంచభూతాల కలయికపై ఆధారపడిన శాస్త్రం. మతాలు, కులాలు మనుషులు ఏర్పరచుకున్నవే. పంచభూతాలు మతాలకు అతీతమైనవి కాబట్టి వాస్తు కూడా అతీతమే అవుతుంది. మనం నివసించే ఇంట్లో ఇవి సక్రమంగా, సమతుల్యంగా ఉన్నప్పుడే జీవితం సవ్యంగా, ఆరోగ్యంగా సాగుతుంది. లేకపోతే ఆ దుష్ఫలితాలు అందరికీ ఒకేలా ఉంటాయి. వాస్తు అందరికీ అవసరం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 12, 2025
2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు

AP: గోదావరి నదీ పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు ఇవి కొనసాగుతాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. TTD ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం మేరకు ఎండోమెంటు కమిషనర్ పుష్కర పుణ్య దినాలపై నివేదిక అందించారు. ఈమేరకు ప్రభుత్వం అధికారికంగా గోదావరి పుష్కర తేదీలను ప్రకటించింది. 2027 జులై 7వ తేదీవరకు ఇవి కొనసాగుతాయని పేర్కొంది.
News December 12, 2025
వారికి ఇంటర్ ఎగ్జంప్షన్ పేపర్‌కు మార్కులు

AP: ఇంటర్ EXAMSలో దివ్యాంగులు ఎగ్జంప్షన్ పొందిన పేపర్‌కు ఇకపై సగటు MARKS ఇస్తారు. ఈమేరకు GO విడుదలైంది. వీరు 2 లాంగ్వేజ్ పేపర్లలో 1 రాస్తే చాలన్న రూలుంది. 5 పేపర్లలో 4కి MARKS వేసి మినహాయింపు పేపర్‌కు ‘E’ అని సర్టిఫికెట్లో పొందుపరుస్తున్నారు. అయితే ఈ సర్టిఫికెట్లపై IIT, NITలు అడ్మిషన్లు నిరాకరిస్తుండడంతో దివ్యాంగులు ఇబ్బంది పడగా గతేడాది లోకేశ్ జోక్యంతో సీట్లు దక్కాయి. ఇపుడన్నిటికీ MARKS ఇస్తారు.


