News January 21, 2025
మహాకుంభమేళా కోసం ఓ IAS ఏం చేశారంటే?

ఓ సివిల్ సర్వెంట్ తలుచుకుంటే ఏం చేయగలరో IAS చంద్రమోహన్ గర్గ్ నిరూపించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న ఈయన మహాకుంభమేళా నేపథ్యంలో డంప్ యార్డును అడవిలా మార్చేశారు. దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని రెండేళ్లలో యార్డులోని వ్యర్థాలను తొలగించి మియావాకీ పద్ధతిలో 1.2 లక్షల మొక్కలను నాటారు. దీంతో దుమ్ము, దూళిని పోగొట్టి గాలి నాణ్యతను పెంచిన ఈ IASను అభినందించాల్సిందే.
Similar News
News February 13, 2025
అప్పుడు పంత్‌ను కాపాడి.. ఇప్పుడు చావుతో పోరాడుతున్నాడు

2022లో ఘోర రోడ్డు ప్రమాదం నుంచి క్రికెటర్ రిషభ్ పంత్‌ను కాపాడిన యూపీ యువకుడు రజత్(21) ప్రస్తుతం చావుతో పోరాడుతున్నాడు. తమ పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని ఈనెల 9న ప్రియురాలు మన్నూతో కలిసి అతడు విషం తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిద్దరినీ ఉత్తరాఖండ్‌లోని రూర్కీ ఆసుపత్రిలో చేర్చించారు. ఈక్రమంలోనే నిన్న మన్నూ మృతి చెందగా రజత్ పరిస్థితి విషమంగా ఉంది.
News February 13, 2025
వంశీ అరెస్టు సరికాదు: బొత్స

AP: మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టును ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఉపసంహరించుకున్న కేసులో అరెస్ట్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలు తగవన్నారు. తొమ్మిది నెలల అధికారాన్ని కూటమి ప్రభుత్వం వృథా చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ బూటకమేనని విమర్శించారు.
News February 13, 2025
ఉడికించిన చికెన్, గుడ్లు తినొచ్చు: మంత్రి అచ్చెన్న

AP: బర్డ్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తింటే ప్రమాదం ఏమీలేదని తేల్చి చెప్పారు. బర్డ్‌ఫ్లూపై సోషల్ మీడియా, కొన్ని పత్రికలు భయాందోళనలు సృష్టిస్తున్నాయని, అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం, శాస్త్రవేత్తలతో చర్చించామని, కోళ్లకు వ్యాధి సోకిన ప్రాంతానికి ఒక కి.మీ పరిధికే ఇది పరిమితం అవుతుందని చెప్పినట్లు వెల్లడించారు.