News August 28, 2024

అసలు HYDRA అంటే ఏంటి?

image

TG: హైదరాబాద్‌లో చెరువులను ఆక్రమించిన వారి గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తోంది. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRA)ని రాష్ట్ర ప్రభుత్వం జులై 19న ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పరిధిలోని చెరువుల సంరక్షణ, విపత్తుల నిర్వహణ, క్రీడా మైదానాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ వంటివి హైడ్రా బాధ్యతలు. చెరువుల FTLలో, బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలను ప్రస్తుతం హైడ్రా కూల్చేస్తోంది.

Similar News

News January 14, 2026

సంక్రాంతిని ఎవరెలా చేస్తారంటే?

image

సంక్రాంతిని దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకుంటారు. కేరళలో మకరజ్యోతి దర్శనం, తమిళనాడులో పొంగల్, పంజాబ్‌లో మాంగి, అస్సాంలో బిహుగా పిలుస్తారు. గుజరాత్‌లో సిదా పేరిట సోదరీమణులకు బహుమతులిస్తారు. UPలో కిచెరి, ఒడిశాలో మకర చౌలాగా ప్రసిద్ధి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి కోడి, పొట్టేళ్ల పందేలతో కోలాహలంగా ఉంటుంది. పేరు ఏదైనా ప్రకృతిని పూజించడం, దానాలు చేయడం, బంధువులతో కలిసి ఆనందాన్ని పంచుకోవడం కామన్.

News January 14, 2026

మొక్కల్లో మాంగనీస్ లోప లక్షణాలు – నివారణ

image

మాంగనీస్ లోపం చీనీ, నిమ్మ తోటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దీని వల్ల ఆకుల మీద పసుపు రంగు లేక పాలిపోయిన మచ్చలు ఏర్పడి క్రమంగా అవి తెల్లగా మారతాయి. ఆకులు కిందకు ముడుచుకొని బోర్లించిన గిన్నెలా అవుతాయి. ఆకులు మీద ఈ లోప చిహ్నాలను సులభంగా గుర్తించవచ్చు. నివారణ కోసం మాంగనీస్ సల్ఫేట్ 0.1 శాతం ద్రావణాన్ని వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసి లోపాన్ని నివారించవచ్చు.

News January 14, 2026

PPPలో వైద్యసేవలపై కేంద్రం మార్గదర్శకాలు

image

AP: PPP విధానంలో మెరుగైన వైద్యసేవల కోసం 5 మార్గదర్శకాలను కేంద్రం నిర్దేశించింది. ఈమేరకు రాష్ట్రానికి లేఖ రాసింది. న్యూక్లియ‌ర్ మెడిసిన్‌, MMUలు, డెంటల్, రేడియాలజీ, క్యాన్సర్ డే కేర్ సెంటర్లను PPPలో విస్తరించాలంది. ఎక్విప్‌, ఆప‌రేట్‌, మెయింటైన్‌ (EOM), ఆప‌రేట్ అండ్ మెయింటైన్‌(O and M)ల ద్వారా సేవ‌లు పెంచాలని పేర్కొంది. ప్రైవేట్ సంస్థలకు చెల్లింపుల విధానంపై కూడా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అందించింది.