News April 2, 2024

హార్దిక్ పాండ్యకు ఏమైంది?

image

ఐపీఎల్‌లో ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన హార్దిక్ పాండ్య ఇంకా విజయాల ఖాతా తెరవలేదు. గుజరాత్ కెప్టెన్‌గా తొలి మూడు మ్యాచుల్లో విజయాన్ని అందుకున్న ఈ ఆల్‌రౌండర్.. MI కెప్టెన్‌గా మాత్రం విఫలమవుతున్నారు. మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో హార్దిక్ ఫెయిల్ అవడం, ఆటగాళ్ల మధ్య సమన్వయం కల్పించడంలో విఫలమవ్వడం వంటివి ముంబై పరాజయాలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు?

Similar News

News February 18, 2026

SMలో ‘ఓవర్ షేరింగ్’ వద్దు.. ఈ విషయాలు పోస్ట్ చేస్తే డేంజర్!

image

SMలో మనం సరదాగా పంచుకునే వివరాలే సైబర్ నేరగాళ్లకు అస్త్రాలుగా మారుతున్నాయి. లైవ్ లొకేషన్, బోర్డింగ్ పాస్, బ్యాంక్ వివరాలు, హోమ్ అడ్రస్, పాన్/ఆధార్, CVV, OTP వంటి కీలక విషయాలను షేర్ చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి ఐడెంటిటీ థెఫ్ట్‌కు దారితీసి మీ పేరిట ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. ప్రైవసీని కాపాడుకోవడానికి టూ-స్టెప్ వెరిఫికేషన్ వంటి సెక్యూరిటీ మోడ్స్ ఆన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

News February 18, 2026

బొత్సకు ‘హెరిటేజ్’ లీగల్ నోటీసులు

image

AP: నెయ్యి వివాదంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. అసత్య, నిరాధార ఆరోపణలతో తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని అందులో పేర్కొంది. తప్పుడు ప్రచారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా 2014-19లో తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ చీకటి ఒప్పందం చేసుకుందని బొత్స ఆరోపించారు.

News February 18, 2026

ఎక్కువ సార్లు డకౌట్ అయింది వీరే

image

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ప్లేయర్లు వీరే:
12- రోహిత్ శర్మ (151 ఇన్నింగ్సులు)
7- విరాట్ కోహ్లీ (117)
7- సంజూ శాంసన్ (50)
6- అభిషేక్ శర్మ (40)
6- సూర్య కుమార్ యాదవ్ (102)
5- అర్ష్‌దీప్ సింగ్ (28)
5- కేఎల్ రాహుల్ (68)