News May 7, 2025
కర్రెగుట్టలో ఏం జరగబోతోంది?

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట వద్ద మావోయిస్టులు దిగొచ్చినట్లు తెలుస్తోంది. సైనిక ఆపరేషన్ వెంటనే ఆపేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు రావాలని బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేశ్ పేరిట ప్రెస్‌నోట్ విడుదలైంది. ఈ లేఖపై పోలీసులు ఇంకా స్పందించలేదు. ప్రభుత్వాలు సైతం శాంతి చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే నలుగురు మావోయిస్టులు మరణించారు.
Similar News
News February 13, 2026
తమలపాకులతో ఇలా చేస్తే..

‘నాగవల్లి దళాలు’ అని పిలిచే తమలపాకులు అతి పవిత్రమైనవి. ఈ ఆకులో లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవతలు ఉంటారని పురాణాల వాక్కు. అందుకే శుభకార్యాల్లో తాంబూలం సమర్పిస్తారు. ఇది సంపూర్ణతకు నిదర్శనం. సీతాదేవి ఆశీస్సుల వల్ల హనుమాన్‌కి ఇవంటే చాలా ప్రీతి. ఆయనను వీటితో పూజిస్తే శని దోషాలు పోతాయని నమ్మకం. అలాగే వీటికి ఔషధ గుణాలెన్నో! జీర్ణక్రియకు చాలా మేలు చేస్తాయి. పూజలో తాజాగా, తొడిమ ఉన్న ఆకులను వాడటం ఉత్తమం.
News February 13, 2026
కోళ్లలో కొక్కెర వ్యాధి – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోళ్ల షెడ్డును శుభ్రంగా ఉంచి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. సంతలో కొన్న పెట్టలను, పుంజులను టీకాలు వేయకుండా షెడ్డులో కోళ్లతో కలిపి ఉంచకూడదు. పెద్ద, చిన్న కోళ్లను వేరువేరుగా ఉంచాలి. వెటర్నరీ నిపుణుల సూచనలతో కోడిపిల్లలు పుట్టిన తొలి వారంలోనే F1(RD)/Lasota టీకా మందు కంటిలో/ముక్కులో వేస్తే 6 వారాల వరకు ఈ కొక్కెర వ్యాధి రాదు. కోళ్లకు ఆరు వారాల వయసులో R2B (R.D.) వ్యాక్సిన్ 0.5 ml s/c వేయాలి.
News February 13, 2026
రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షల క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్

రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సాయం అందేలా ‘PM రాహత్’ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపారు. దీని కింద బాధితులకు ₹1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అందుతుంది. వైద్య సాయం అందక ఎవరూ మరణించొద్దన్న లక్ష్యంతో ఈ స్కీమ్‌ను రూపొందించారు. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. కొత్తగా ప్రారంభించిన ‘సేవా తీర్థ్’లో ప్రధాని మోదీ తీసుకున్న తొలి నిర్ణయాల్లో ఇదొకటి.


