News April 1, 2024

కచ్చతీవు వివాదం ఏంటి?(2/2)

image

శ్రీలంక మాత్రం ఈ ఒప్పందాన్ని పట్టించుకోవడం లేదు. మత్స్యకారులను తరుచూ అదుపులోకి తీసుకుంటోంది. న్యాయపరంగా ఈ <<12964536>>దీవి<<>> అప్పగింత చెల్లదని తమిళనాడులోని పలు పార్టీలు వాదిస్తున్నాయి. భారత భూభాగాలను రాజ్యాంగ సవరణ చేయకుండా ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై ఆర్టీఐ దరఖాస్తు సేకరణతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Similar News

News February 9, 2026

దీపారాధన తర్వాత కాలిన వత్తులను ఏం చేయాలి?

image

దీపం వెలిగించిన తర్వాత కాలిన వత్తులను, ఆ బూడిదను పవిత్రంగా భావించాలి. వీటిని ఎప్పుడూ చెత్తబుట్టలో, అపవిత్ర ప్రదేశాలలో పారేయకూడదు. 10 రోజుల పాటు సేకరించిన ఆ వత్తులను 11వ రోజున కర్పూరం, లవంగాలు వేసి కాల్చాలి. ఆ ధూపాన్ని ఇల్లంతా తిప్పితే ప్రతికూల శక్తులు నశిస్తాయి. చివరగా మిగిలిన బూడిదను శుభకార్యాలకు వెళ్లే ముందు తిలకంలా ధరించవచ్చు. మొక్కల మొదట్లో వేస్తే మంచి జరుగుతుంది. వాటిని అపవిత్రం చేయకూడదు.

News February 9, 2026

కల్తీ నెయ్యి వ్యవహారం.. కేసు నమోదు చేసిన ఈడీ

image

AP: తిరుమల కల్తీ నెయ్యి <<18933854>>వ్యవహారం<<>>లో హవాలా ద్వారా డబ్బులు చేతులు మారాయనే ఆరోపణల నేపథ్యంలో ED రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ECIR) నమోదు చేసింది. ₹235 కోట్ల అక్రమాలు జరిగాయని, ₹20 కోట్లకు పైగా హవాలా జరిగిందని ఛార్జ్‌షీట్‌లో CBI పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ముడుపులు అందుకున్న వారికి, ఏజెంట్లకు త్వరలో ED నోటీసులు జారీచేసే అవకాశం ఉందని సమాచారం.

News February 9, 2026

394 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>IOCL<<>>) పైప్‌లైన్స్ విభాగంలో 394 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిప్లొమా, డిగ్రీ, ఇంటర్ అర్హత గలవారు NATS/NAPS పోర్టల్‌‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత plapps.indianoilpipelines.inలో అప్లై చేసుకోవాలి. వయసు 18- 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iocl.com