News April 21, 2024

బ్లూవేల్ ఛాలెంజ్ అంటే ఏమిటి?

image

ఇది ఒక ఆన్‌లైన్ గేమ్. మొదటగా రష్యాలో మొదలైంది. ఈ గేమ్‌లో 50 రోజులపాటు 50 రకాల ఛాలెంజ్‌లు పూర్తి చేయాలనే టార్గెట్ ఉంటుంది. అర్ధరాత్రి లేవడం, భయానక వీడియోలు చూడటంతోపాటు పలు రకాల సాహసాలను లైవ్‌లో ప్రదర్శించాలి. చివరికి తీవ్రత పెంచి ఆత్మహత్య చేసుకోవాలనే టాస్క్ కూడా ఉండొచ్చు. 2015లో ఓ టీనేజర్ సూసైడ్ తర్వాత పలు దేశాలు ఈ గేమ్ నెట్‌వర్క్‌ను క్లోజ్ చేశాయి. ఇప్పుడు మరోసారి ఈ గేమ్ వెలుగులోకి వచ్చింది.

Similar News

News December 13, 2025

పప్పు గింజల పంటల్లో చిత్త పురుగులు.. నివారణ

image

మినుము, పెసర, అలసంద, కంది లాంటి పప్పు గింజల పైర్లు లేత దశలో(2-4 ఆకులు) ఉన్నప్పుడు చిత్త/పెంకు పురుగులు ఆశిస్తాయి. ఆకుల అడుగు భాగాల్లో చేరి రంధ్రాలు చేసి తినేస్తాయి. దీంతో మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. వీటి నివారణకు కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 5గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5ML మందులతో విత్తనశుద్ధి చేసుకోవాలి. పంటలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ML లేదా ఎసిఫేట్ 1.5గ్రా. కలిపి పిచికారీ చేసుకోవాలి.

News December 13, 2025

బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఫలితాల వెల్లడిలో మార్పులు

image

బ్యాంక్ ఉద్యోగాల నియామకాల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. SBI, నేషనల్ బ్యాంకులు, RRB (Regional Rural Banks)ల పరీక్షా ఫలితాల ప్రకటన క్రమాన్ని మార్చింది. ఇకపై ముందుగా SBI, ఆ తర్వాత నేషనల్ బ్యాంకులు, చివరగా RRBల ఫలితాలను విడుదల చేస్తారు. అదే విధంగా ముందుగా PO (Probationary Officer) రిజల్ట్స్ తరువాత క్లరికల్‌వి ప్రకటించనున్నారు. దీనివల్ల అభ్యర్థులు మంచి ఉద్యోగాన్ని సెలక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

News December 13, 2025

MLAల చేతుల్లో MRO ఆఫీసులు: ధర్మాన

image

AP: భూ సమస్యలు తీరక సామాన్యులు బాధపడుతున్నారని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ‘5 సెంటీమీటర్ల తేడా కూడా లేకుండా కొలతలు చేయగల టెక్నాలజీతో భూ సర్వే జరుపుతుంటే, సర్టిఫికెట్‌పై జగన్ బొమ్ముందని, భూములు ఆయన తీసుకుంటారని చంద్రబాబు మాయ మాటలు చెప్పారు. ఇన్నేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఒక్క భూ సంస్కరణ అయినా తెచ్చారా? నేడు ఎమ్మార్వో కార్యాలయాలన్నీ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లిపోయాయి’ అని విమర్శించారు.