News April 1, 2024
‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్స్ ఎంతంటే?

సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.68.1 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద టిల్లన్న డామినేషన్ కొనసాగుతోందని పేర్కొంది. ‘డీజే టిల్లు’కు కొనసాగింపుగా ఈ మూవీ వచ్చింది.
Similar News
News February 16, 2026
అటు బంగ్లా, ఇటు పాక్‌కు చెక్ పెట్టిన భారత్

తమ దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చి పౌరులకు భద్రత కల్పించిన భారత్‌లోనే రక్షణ లేదంటూ బంగ్లాదేశ్ అహంకారం ఒకవైపు. ‘మేం కూడా భారత్‌తో మ్యాచ్ ఆడం’ అంటూ చివరి వరకు నక్క తెలివితేటలు చూపిన పాకిస్థాన్ మరోవైపు. ఈ రెండు దేశాల తలపొగరును <<19153355>>తన ఆటతో<<>> దించేసింది టీమ్ ఇండియా. ‘అతడు’ సినిమాలో తనికెళ్ల భరణి ఫేమస్ డైలాగ్ మాదిరిగా చాలా పద్ధతిగా, సమష్టిగా దెబ్బకొట్టింది. ‘తగ్గేదేలే’ అంటూ భారత్ మరోసారి సత్తా చాటింది.
News February 16, 2026
TODAY HEADLINES

* T20WC: పాక్‌పై భారత్ ఘన విజయం
* జాబ్ క్రియేటర్లుగా డేటా సెంటర్లు: మోదీ
* CECపై అభిశంసనకు సిద్ధమైన విపక్షాలు
* ఏపీలో రేపు ఆప్షనల్ హాలిడే.. తెలంగాణలో నో
* కోవా బన్ను వివాదం.. బాధితుడికి లోకేశ్ మద్దతు
* రైతులకు రూ.20వేలు ఎక్కడ: YCP
* మున్సిపల్ ఫలితాలు నా పనికి గీటురాయి: రేవంత్
* TG: రేపే మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక
* TG: ఒకే విడతలో రైతుభరోసా.. 17న జమ!
News February 16, 2026
మంత్రులతో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్

TG: కార్పొరేషన్ మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నికపై సీఎం రేవంత్ మంత్రులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. రేపు వీరి ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. హంగ్ ఏర్పడిన చోట ఏ ఒక్కటి చేజారనీయొద్దని నేతలకు దిశానిర్దేశం చేశారు. మీటింగ్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి తదితరులు పాల్గొన్నారు.


