News April 27, 2024

వాట్సాప్-కేంద్రం మధ్య వివాదమేంటి?

image

2021 IT నిబంధనల ప్రకారం ప్రభుత్వం కోరినప్పుడు వాట్సాప్ మెసేజ్‌ల వివరాలను మెటా బహిర్గతం చేయాలి. అవాంఛనీయ మెసేజ్ వైరల్ అయితే దాన్ని మొదట పంపిన వ్యక్తిని గుర్తించడానికి సహకరించాలి. అయితే భారత్‌లో 40 కోట్ల మంది ఖాతాదారుల మేసేజ్‌ల డేటాను ఏళ్ల తరబడి స్టోర్ చేయడం అసాధ్యమని కంపెనీ <<13129375>>వాదిస్తోంది<<>>. పౌరుల గోప్యతకు భంగకరమని చెబుతోంది. ఎన్‌క్రిప్షన్ తీసేయాలంటే సేవలను రద్దు చేసుకుంటామని స్పష్టం చేస్తోంది.

Similar News

News April 20, 2026

హ్యాపీ బర్త్‌డే మావయ్య: NTR

image

ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుకు యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ హ్యాపీ బర్త్‌డే మావయ్యగారు అని SMలో శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని.. ఇదే నిబద్ధత, విజన్‌తో ప్రజలకు సేవలు కొనసాగించాలని కోరుకున్నారు. మీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలని ఆశిస్తున్నానని Xలో పోస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ చీఫ్ జగన్ కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

News April 20, 2026

రహానే చెత్త రికార్డు

image

నిన్న RRతో మ్యాచులో సున్నాకే ఔటైన KKR కెప్టెన్ రహానే IPLలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఓపెనర్‌గా అత్యధిక సార్లు(12) డకౌట్ అయిన ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో పార్థివ్ పటేల్(11), శిఖర్(10), గంభీర్(10), వార్నర్(9) ఉన్నారు. ఓవరాల్‌(బ్యాటింగ్ పొజిషన్‌తో సంబంధం లేకుండా)గా మ్యాక్స్‌వెల్(19) టాప్‌లో ఉన్నారు. కాగా సీజన్‌లో రహానే 7 మ్యాచుల్లో 25.33 యావరేజ్‌తో 152 రన్స్ చేశారు.

News April 20, 2026

అమానుషం.. కన్నపిల్లల్నే కాల్చి చంపాడు!

image

అమెరికాలోని లూసియానా కాల్పుల <<19693285>>కేసులో<<>> హృదయవిదారక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు కాల్చి చంపిన ఎనిమిది మంది పిల్లల్లో ఏడుగురు కన్నబిడ్డలే ఉన్నారు. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉంది. భార్య, మరో మహిళపైనా నిందితుడు కాల్పులు జరపగా వారి పరిస్థితి విషమంగా ఉంది. 2024 జనవరి తర్వాత USలో ఈ స్థాయిలో కాల్పులు జరగడం ఇదే తొలిసారి. పోలీసుల కాల్పుల్లో నిందితుడు చనిపోగా ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.