News May 7, 2025
భారత్‌తో కయ్యం.. పాకిస్థాన్‌కు నష్టం ఎంతంటే?

పాకిస్థాన్ తమ గగనతలాన్ని మూసేసింది. ఈ చర్యతో పాకిస్థాన్‌కే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని తెలుస్తోంది. పాక్ గగనతలాన్ని వాడుకున్నందుకు భారత్ డబ్బు చెల్లిస్తుంది. ఇలాగే 2019లో 140 రోజులు గగనతలాన్ని మూసేయడం వల్ల పాక్ 100 మిలియన్ డాలర్లు నష్టపోయిందట. ఇప్పుడూ అన్ని రోజులు మూసేస్తే.. 120-160 మి. డాలర్లు నష్టపోయే అవకాశం ఉంది. పంతానికి పోతే చావు దెబ్బ తగిలేది పాకిస్థాన్‌కే అని విశ్లేషకులు చెబుతున్నారు.
Similar News
News February 7, 2026
ఇలాంటి సేంద్రియ ఎరువులతో ఎక్కువ లాభం

గాఢ సేంద్రియ ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలను ఎక్కువగా కలిగి ఉండి నేలకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి. ఉదాహరణ: కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండి, ఆముదపు పిండి, కానుగ పిండి, పత్తి గింజల పిండి, చేపల పొట్టు, ఎముకల పొడి, కొమ్ముల పొడి, వర్మి కంపోస్టు మొదలైనవి. వీటి కొనుగోలు కాస్త ఖర్చుతో కూడుకున్నదైనా నిపుణుల సూచనల మేరకు వీటిని వినియోగిస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది.
News February 7, 2026
రోహిత్, కోహ్లీని డిమోట్ చేసిన బీసీసీఐ!

భారత ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి సెంట్రల్ కాంట్రాక్టులో BCCI షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారిని గ్రూప్-Bకి డిమోట్ చేసినట్లు సమాచారం. A+ కేటగిరీని బోర్డు తొలగించిందని NDTV పేర్కొంది. గ్రూప్ Aలో గిల్, బుమ్రా, జడేజాకు చోటు కల్పించిందని తెలిపింది. రోహిత్, కోహ్లీ, జడేజా టెస్టులు, T20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ జడేజాను మాత్రమే గ్రూప్ Aలో ఎందుకు ఉంచారనేది తెలియాల్సి ఉంది.
News February 7, 2026
APPLY NOW: C-DOTలో సైంటిస్ట్ పోస్టులు

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(<


