News October 8, 2025
మీరు వద్దనుకున్నవి.. వారికి సంతోషాన్నిస్తాయి!

దీపావళి సందర్భంగా అందరూ ఇళ్లు శుభ్రం చేసుకుంటూ పాత వస్తువులను బయట పారేస్తుంటారు. అయితే పనికొచ్చే వస్తువులను, దుస్తులను పడేసే ముందు ఓసారి ఆలోచించండి. మీరు వద్దనుకునే ఆ వస్తువులు ఎంతోమందికి ఉపయోగపడొచ్చు. బట్టలు, పుస్తకాలు, ఆట బొమ్మలు, వంట సామగ్రి, పాదరక్షలు, ఎలక్ట్రానిక్స్ మొదలైన వస్తువులను అవసరమైన వాళ్లకు ఇచ్చేందుకు ముందుకురండి. చాలా NGOలు, శరణాలయాలు వీటిని స్వీకరిస్తాయి. SHARE IT
Similar News
News January 20, 2026
IIT రూర్కేలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

<
News January 20, 2026
2026 పెళ్లి ముహూర్తాలు ఇవే: పండితులు

శుక్ర మౌఢ్యమి కారణంగా ఫిబ్రవరి 17 వరకు ముహూర్తాలు లేవని పండితులు తెలిపారు.
*ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26 *మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12
*ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29 *మే: 1, 3, 5, 6, 7, 8, 13, 14 *జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29 *జులై: 1, 6, 7, 11 *AUG నుంచి OCT వరకు చాతుర్మాస్యం, శూన్య మాసం వల్ల ముహూర్తాలు లేవు.
*నవంబర్: 21, 24, 25, 26 *డిసెంబర్: 2, 3, 4, 5, 6, 11, 12
News January 20, 2026
రాసలీలల వీడియో వైరల్.. కర్ణాటక DGPపై సస్పెన్షన్ వేటు

కర్ణాటక సీనియర్ IPS, <<18898562>>DGP<<>> ర్యాంక్ అధికారి రామచంద్రరావుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర వీడియోలు వైరల్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తన ఆఫీసులోనే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. క్రమశిక్షణ ఉల్లంఘన కింద సర్వీస్ నుంచి తొలగిస్తూ విచారణకు ఆదేశించింది. అయితే ఈ వీడియోలు మార్ఫింగ్ చేసినవని రామచంద్రరావు వాదిస్తున్నారు.


