News May 13, 2024

ఎగ్జిట్ పోల్స్‌ ఎప్పుడంటే?

image

జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ సమయంలో అన్ని దశల పోలింగ్ తర్వాతే ఇవి రిలీజ్ అవుతాయి. ముందుగా విడుదల చేస్తే మిగతా ఫేజ్‌ల ఎన్నికలు ప్రభావితం అవుతాయనే కారణంతో ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ ఆంక్షలు విధిస్తుంది. ప్రస్తుతం 4వ దశ ఎన్నికలు పూర్తి కాగా జూన్ 1న చివరిదైన 7వ దశ పోలింగ్ జరగనుంది. దీంతో అదే రోజు సాయంత్రం 6.30 నుంచి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడతాయి.

Similar News

News December 9, 2025

రూ.40 వేల కోట్లు ఇచ్చాం: కేంద్రం

image

2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 2వ తేదీ నాటికి ఏపీకి మొత్తం రూ.40,337 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. లోక్‌సభలో BJP MP దగ్గుబాటి పురందీశ్వరి ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కోసం ఇప్పటివరకు రూ.20,650 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఏపీకి బకాయిలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు.

News December 9, 2025

సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

AP: ఉత్తర కోస్తాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. నిన్న ఈ ఏడాదిలోనే అత్యల్పంగా అల్లూరి(D) దళపతిగూడలో 3.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ 3-4డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. వాయవ్య భారతం నుంచి మధ్య భారతం వరకు అధిక పీడనం కొనసాగడం వల్ల గాలులు వీస్తున్నాయని, ఫలితంగా చలి పెరిగిందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 13వ తేదీ వరకు చలి కొనసాగుతుందని పేర్కొంది.

News December 9, 2025

గొర్రెల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

image

గొర్రెల మంద ఎదుగుదలలో ఆడగొర్రెలది కీలకపాత్ర. ఇది ఎంత బాగుంటే మంద అంత బాగుంటుంది. ఆడ గొర్రెలు త్వరగా ఎదిగి , సంతానోత్పత్తికి అనుకూలంగా మారే లక్షణం కలిగి ఉండాలి. మందలో పునరుత్పాదక శక్తి తగ్గిన, పళ్లు లేని గొర్రెలను ఏరివేయాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం ఎదకి రాని గొర్రెలు, గొడ్డుమోతు జీవాలను మంద నుంచి ఏరివేసి, చూడి లేదా తొలిసారి ఈనిన గొర్రెలను కొంటే బాగుంటుంది. ఏటా ముసలి గొర్రెలను మంద నుంచి తీసేయాలి.