News July 31, 2024

నీట్-యూజీ తొలి విడత కౌన్సెలింగ్ ఎప్పుడంటే?

image

ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు నీట్-యూజీ తొలి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 14న ప్రారంభం కానున్నట్లు కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ లోక్‌సభ‌లో వెల్లడించారు. నాలుగు విడతల్లో ఈ ప్రక్రియ జరగనుండగా ఫైనల్ ఫేజ్ అక్టోబర్ 24న జరుగుతుందని చెప్పారు. అభ్యర్థుల నమోదు ఆగస్టు మొదటివారంలో మొదలవుతుందని, ప్రవేశాలను ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు.

Similar News

News December 14, 2025

భారత్ బౌలింగ్.. బుమ్రా స్థానంలో హర్షిత్

image

సౌతాఫ్రికాతో ధర్మశాలలో జరిగే మూడో టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. స్టార్ పేసర్ బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు.
భారత్: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, దూబే, జితేశ్ శర్మ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

News December 14, 2025

దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే: ఖర్గే

image

ఓట్ చోరీకి పాల్పడే వారు ద్రోహులని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైరయ్యారు. ఓటు హక్కు, రాజ్యాంగాన్ని కాపాడాలంటే BJPని అధికారం నుంచి దింపేయాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ భావజాలాన్ని బలోపేతం చేయడం భారతీయుల బాధ్యత. దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే. RSS ఐడియాలజీ దేశాన్ని నాశనం చేస్తుంది’ అని ఆరోపించారు. తన కొడుక్కు ఆపరేషన్ ఉన్నా వెళ్లలేదని, 140 కోట్ల మందిని కాపాడటమే ముఖ్యమని ర్యాలీకి వచ్చానని తెలిపారు.

News December 14, 2025

ఇతిహాసాలు క్విజ్ – 96 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: సూర్యుడి వేడిని తాళలేక తన లాంటి రూపమున్న స్త్రీని సృష్టించి, సూర్యుని వద్ద ఉంచి, అశ్వ రూపంలో అడవులకు వెళ్లిపోయింది ఎవరు?
సమాధానం: సూర్య భగవానుడి భార్య అయిన సంజ్ఞా దేవి తనలాగే ఉండే ఛాయాదేవిని సృష్టించి అడవులకు వెళ్లిపోయింది. సూర్యుని ద్వారా సంజ్ఞా దేవికి యముడు, యమున జన్మించారు. ఛాయాదేవికి శని, సావర్ణి, తపతి జన్మించారు. <<-se>>#Ithihasaluquiz<<>>