News April 25, 2024

CMAT పరీక్ష ఎప్పుడంటే?

image

మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీమ్యాట్ పరీక్ష తేదీ ఖరారైంది. మే 15న పరీక్షను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. తాజాగా CMAT దరఖాస్తు గడువు ముగిసిన సంగతి తెలిసిందే. పరీక్షకు 10 రోజుల ముందు సిటీ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ వివరాలు వెల్లడిస్తామని NTA తెలిపింది.

Similar News

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ RESULTS.. MBNRకు 17th Rank

image

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. MBNR(D)లో రెగ్యులర్ విద్యార్థులు 8,116 మంది పరీక్షలు రాయగా 5,896 మంది పాసై 72.65%తో స్టేట్‌లో 17వ ర్యాంకు సాధించింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1,740 మందికి 1,432మంది పాసై 82.30%తో 6వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 1,049 మందికి 364 మంది పాసై 34.70%తో 11వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 110 మందికి 54 మంది పాసై 49.09%తో 21వ ప్లేస్ వచ్చింది.

News April 12, 2026

ఫలితాలు విడుదల.. నిరాశ వద్దు మిత్రమా!

image

TG: ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్ ఎలా వచ్చినా నిరాశపడొద్దు. మీ టాలెంట్‌ను, ఫ్యూచర్‌ను పరీక్షలే నిర్ణయిస్తాయి అనుకోవడం పెద్ద తప్పు. ఆశించిన ఫలితం రానంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదు. సప్లిమెంటరీ రాసి పడిలేచిన కెరటంలా ముందుకెళ్లాలి. అటు పిల్లలు ఫెయిలైనా, తక్కువ మార్కులు వచ్చినా తల్లిదండ్రులు అవమానించవద్దు. మీరే అలా చేస్తే వారికి ధైర్యం చెప్పేవారు ఎవరు?
Share It

News April 12, 2026

‘డెకాయిట్’ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

image

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటించిన ‘డెకాయిట్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.28కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. షానియెల్ డియో డైరెక్ట్ చేసిన ఈ మూవీ తొలి రోజు రూ.15కోట్లకు పైగా రాబట్టిన సంగతి తెలిసిందే. ఇందులో అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాశ్‌రాజ్ తదితరులు నటించారు. భీమ్స్ సంగీతం అందించారు.