News December 24, 2024

ఇన్సూరెన్స్‌లో లోయెస్ట్ రిజెక్షన్ రేటు ఎవరిదంటే?

image

అత్యల్ప క్లెయిమ్స్ రిజెక్షన్ రేషియో 0.2%తో న్యూఇండియా అస్యూరెన్స్ రికార్డు సృష్టించింది. దాదాపుగా క్లెయిమ్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ బీమా డబ్బును బదిలీ చేసింది. ప్రైవేటులో HDFC Ergo, Future Generali, ఆదిత్య బిర్లా హెల్త్, శ్రీరామ్ ముందున్నాయి. ఇక 2022-23లో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ టు సెటిల్మెంట్ రేషియో 86 శాతమని IBAI డేటా ద్వారా తెలుస్తోంది. FY22తో పోలిస్తే ఒకశాతం తగ్గడం గమనార్హం.

Similar News

News January 26, 2025

పక్క రాష్ట్రానికి 5 ఇచ్చినప్పుడు మాకు నాలుగైనా ఇవ్వాలి కదా?: రేవంత్

image

TG: ‘పద్మ’ అవార్డుల ప్రకటనలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపించిందని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విమర్శించారు. ‘పక్క రాష్ట్రానికి ఐదు అవార్డులు ఇచ్చినప్పుడు మాకు ఒకటి తక్కువతో నాలుగు ఇచ్చినా రాష్ట్ర పెద్దలందరికీ గౌరవం దక్కేది. తొందర్లోనే దీనిపై ప్రధానికి లేఖ రాయబోతున్నా. అన్యాయం జరిగినప్పుడు నిరసన తెలపాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రజాస్వామ్యయుతంగా తెలియజేస్తాం’ అని వెల్లడించారు.

News January 26, 2025

ఆ ప్రచారం నమ్మొద్దు.. ‘RC 16’ టీమ్

image

రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో ‘RC 16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాకు ఆస్కార్ విన్నర్ AR రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి రెహ్మాన్ తప్పుకొన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన టీమ్ ఇందులో వాస్తవం లేదంది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని అభిమానులకు సూచించింది. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.

News January 26, 2025

నేడు మధ్యప్రదేశ్‌కు సీఎం రేవంత్

image

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి మధ్యప్రదేశ్‌కు వెళ్లనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లోని డాక్టర్ అంబేడ్కర్ నగర్‌లో నిర్వహించనుంది. ‘సంవిధాన్’ పేరిట రేపు జరిగే ఆ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.