News May 13, 2024

నాగబాబు ట్వీట్ ఎవరి కోసం?

image

మెగా బ్రదర్, జనసేన జనరల్ సెక్రటరీ నాగబాబు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే’ అని రాసుకొచ్చారు. దీనిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఇటీవల మెగా హీరో అల్లు అర్జున్ YCP MLA అభ్యర్థి రవిచంద్రారెడ్డి‌కి ఇంటికెళ్లి మద్దతిచ్చిన విషయం తెలిసిందే. దీంతో బన్నీని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Similar News

News December 15, 2025

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ఉద్యోగాలు

image

<>టాటా<<>> ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌ 7 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు JAN 3 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, NTC, సైన్స్ గ్రాడ్యుయేట్(ఫిజిక్స్, ఇంజినీరింగ్ ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/రేడియో ఫిజిక్స్), డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ట్రేడ్/స్కిల్ టెస్ట్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.tifr.res.in

News December 15, 2025

టమాటా కాయ ఆకృతి కోల్పోవడానికి కారణం ఏమిటి?

image

టమాటా కాయలు ఆకృతిని కోల్పోయే సమస్య ఎక్కువగా కాయలో పూత చివరి వైపు కనిపిస్తుంది. పిందె కట్టే దశలో చల్లని వాతావరణం వల్ల కాయ ఆకృతి కోల్పోతుంది. పెద్ద పరిమాణం గల కాయరకాల్లో ఈ సమస్య సాధారణంగా ఉంటుంది. దీని నివారణకు కలుపు మందులు లేదా పెరుగుదలను నియంత్రించే రసాయనాలను పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. టమాట పంటను మురుగు నీరు బయటకు పోయే వసతి లేని నేలల్లో పండించకూడదు.

News December 15, 2025

పెరగనున్న టీవీల ధరలు!

image

కొత్త ఏడాదిలో TVల ధరలు పెరిగే అవకాశం ఉంది. మెమొరీ చిప్‌ల కొరత, రూపాయి పతనం, దిగుమతి వ్యయాలు పెరగడం ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో జనవరిలో 3 నుంచి 10% వరకు టీవీల ధరలు పెరగొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని తయారీ కంపెనీలు డీలర్లకు ఈ విషయం తెలియజేశాయని పేర్కొంటున్నాయి. గత మూడేళ్లలో మెమొరీ చిప్‌ల ధరలు 500% ఎగిశాయని, వచ్చే 6 నెలలూ పెరిగే అవకాశం ఉందని వెల్లడించాయి.