News August 9, 2024
అన్న క్యాంటీన్ల ఫుడ్ సప్లై బాధ్యతలు ఎవరికంటే?

AP: ఈ నెల 15న ప్రారంభించనున్న అన్న క్యాంటీన్లకు ఆహార సరఫరా బాధ్యతలను హరేకృష్ణ ఫౌండేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సప్లై చేసేలా కాంట్రాక్టును ఈ సంస్థ దక్కించుకుంది. భవన నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో తొలి విడతలో 100, రెండో విడతలో 83, మూడో విడతలో 20 క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.
Similar News
News December 11, 2025
గురువారం బృహస్పతిని పూజిస్తే..

మహావిష్ణువుతో పాటు బృహస్పతిని కూడా గురువారం ఆరాధించడం వల్ల కుటుంబంలో శాంతి, సిరిసంపదలు, సంతోషం కలుగుతాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. దత్తాత్రేయుడిని కూడా పూజించవచ్చని అంటున్నారు. ఈ వారానికి అధిపతి అయిన బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి అరటి బోదెలో దీపం వెలిగించడం, పసుపు దుస్తులు ధరించడం, అదే రంగు పూలు సమర్పించడం శుభప్రదం. నెయ్యి, బెల్లంతో నైవేద్యం పెట్టాలి’ అని చెబుతున్నారు.
News December 11, 2025
నిద్ర తక్కువైతే!

నిద్ర తక్కువైతే ఆరోగ్యం దెబ్బతిని గుండె జబ్బులు, బీపీ, మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కొన్ని రోజులు సరైన నిద్ర లేకుంటే రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఏకాగ్రత లోపించడం, నిరాశ, కుంగుబాటు వంటివి పెరుగుతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి ఆయుష్షునూ తగ్గిస్తుంది’ అని చెబుతున్నారు. మంచి నిద్ర కోసం ధ్యానం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, క్రమమైన నిద్ర సమయాలు పాటించాలని సూచిస్తున్నారు.
News December 11, 2025
రోహిత్ గొప్ప హృదయానికి అది నిదర్శనం: జైస్వాల్

సౌతాఫ్రికాతో ఇటీవల భారత్ ఆడిన మూడో వన్డేలో యశస్వి జైస్వాల్ తన కెరీర్‌లోనే తొలి సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే క్రీజులో కుదురుకునేందుకు ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ తనతో మాట్లాడుతూ భరోసా ఇచ్చినట్లు జైస్వాల్ తెలిపారు. ‘నేను రిస్క్ తీసుకుంటా. నువ్వు ప్రశాంతంగా టైం తీసుకొని ఆడు’ అని తనతో చెప్పినట్లు వివరించారు. ఇది తన గొప్ప హృదయానికి నిదర్శనం అని కొనియాడారు.


