News March 15, 2025
ముస్లింలకే 4% రిజర్వేషన్లు అని ఎవరు చెప్పారు?: DK శివకుమార్

ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4% రిజర్వేషన్లు ముస్లింలకే కేటాయించిందని కర్ణాటక సర్కారును ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వేళ ఆ రాష్ట్ర Dy.CM డీకే శివ కుమార్ స్పందించారు. ‘కేవలం ముస్లింలకు 4% రిజర్వేషన్లు అని ఎవరు చెప్పారు. వెనకబడిన తరగతుల వారి కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మైనార్టీలు అంటే ముస్లింలే కాదు. అందులో క్రిస్టియన్లు, జైనులు, పార్సీలు, సిక్కులు, మొదలైన వారు ఉంటారు’ అని క్లారిటీ ఇచ్చారు.
Similar News
News February 12, 2026
ఇలాంటి నాయకుడు కావాలి సర్!

ఆప్ ఎంపీ, యువ నేత <<19108486>>రాఘవ్ సింగ్ చద్ధా<<>> పార్లమెంటులో లేవనెత్తుతున్న సమస్యలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆహార కల్తీ, ధరలు, ప్రజా సంక్షేమం, పన్నుల మోత.. ఇలా సామాన్యుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈయన వల్లే 10 నిమిషాల డెలివరీ, గిగ్ వర్కర్ల సమస్యలు దేశానికి తెలిశాయి. కార్పొరేట్ ట్యాక్స్ కంటే వ్యక్తులు చెల్లించే ఆదాయపు పన్ను ఎక్కువగా ఉందని వేతన జీవుల కష్టాన్ని తెలియజేశారు.
News February 12, 2026
ఒమన్‌పై లంక ఘన విజయం

T20WCలో ఒమన్‌పై శ్రీలంక 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత శ్రీలంక 225/5 స్కోర్ చేసింది. కుశాల్ మెండిస్(61), పవన్(60), దసున్ శనక(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. 226 రన్స్ టార్గెట్‌తో బరిలో దిగిన ఒమన్ 120/9 స్కోరుకే పరిమితమైంది. ఈ విజయంతో గ్రూప్-Bలో లంక(4 పాయింట్లు) అగ్రస్థానానికి చేరుకుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచిన విషయం తెలిసిందే.
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘నటరాజ’’

శివుడు సమస్త కళలకు, నాట్యానికి అధిపతి. ఆయన చేసే తాండవం సృష్టి గమనాన్ని సూచిస్తుంది. శివుడు ‘ఆనంద తాండవం’ చేస్తున్నప్పుడు సృష్టి నిర్మాణం జరుగుతుందని, ‘రుద్ర తాండవం’ చేసినప్పుడు దుష్టశిక్షణ జరుగుతుందని చెబుతారు. ప్రపంచంలోని అణువణువూ ఆయన చలనం (నాట్యం) వల్లే కదులుతోందని కొందరు శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తారు. నాట్య కళ ద్వారా విశ్వ రహస్యాలను వెల్లడించే ఈ సార్వభౌముడిని ‘నటరాజు’గా మనం కొలుచుకుంటాం.


