News August 20, 2025
తుది జట్టులో గిల్.. ఎవరిని పక్కన పెట్టాలి?

ఆసియా కప్‌కు భారత జట్టును BCCI ప్రకటించిన విషయం తెలిసిందే. వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడంతో గిల్‌కు తుది జట్టులో ప్లేస్ ఖాయమైనట్లే. దీంతో టాపార్డర్ బ్యాటర్స్ అభిషేక్, శాంసన్, తిలక్‌లలో ఒకర్ని పక్కన పెట్టాల్సి రావొచ్చు. అభిషేక్ ICC No.1 ర్యాంకర్‌గా ఉన్నారు. మరోవైపు శాంసన్ గత 10 T20Isలో 3 సెంచరీలు, తిలక్ లాస్ట్ 7 T20Isలో 2 సెంచరీలు చేసి ఫామ్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరిని పక్కన పెట్టాలి? COMMENT
Similar News
News January 18, 2026
కర్ణుడి దానగుణం: మానవత్వమే పరమార్థం

మహాభారత యుద్ధంలో కర్ణుడి దానపుణ్యమే అతడికి రక్షగా నిలిచింది. చివరి క్షణంలో కృష్ణుడు అడిగినప్పుడు కర్ణుడు తన పుణ్యఫలాన్ని కూడా దానమిచ్చాడు. వరం కోరమని అడగ్గా.. మరుజన్మలోనూ సాయం చేసే హృదయాన్నే కోరుకున్నాడు. ముక్తి కోసం దేవుడిని వెతకక్కర్లేదని, తోటివారికి సాయపడే గుణం ఉంటే ఆ దేవుడే మనల్ని చేరుకుంటాడని ఈ కథ నిరూపిస్తోంది. పరోపకారమే నిజమైన దైవారాధనని కర్ణుడి జీవితం చాటిచెబుతోంది.
News January 18, 2026
C-DOTలో సైంటిస్ట్ పోస్టులు

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(<
News January 18, 2026
రూ.300కోట్ల దిశగా MSVPG కలెక్షన్స్

చిరంజీవి, నయనతార జంటగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.261కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ మూవీలో చిరంజీవి కామెడీ టైమింగ్, వెంకటేశ్ క్యామియో, అనిల్ రావిపూడి డైరెక్షన్, భీమ్స్ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.


