News March 31, 2024
సత్తెనపల్లి గడ్డపై సత్తా చాటేదెవరో?

AP: రాజకీయ చైతన్యం పుష్కలంగా ఉన్న నియోజకవర్గం పల్నాడు(D) సత్తెనపల్లి. ఇక్కడ అభ్యర్థికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య ఇక్కడి నుంచే 2సార్లు ఇండిపెండెంట్‌గా గెలిచారు. కాంగ్రెస్ 4సార్లు, స్వతంత్రులు 3సార్లు, CPM, TDP 2సార్లు, CPI, YCP ఒక్కోసారి నెగ్గాయి. ఈసారి రాజకీయాల్లో తలపండిన అంబటి రాంబాబు (YCP), కన్నా లక్ష్మీనారాయణ(TDP) ఢీకొంటున్నారు.
#ELECTIONS2024
Similar News
News February 17, 2026
‘ఫర్టిగేషన్’లో ఎలాంటి ఎరువులను అందించే అవకాశం ఉంటుంది?

ఈ మధ్యకాలంలో రైతులు సేంద్రియ వ్యవసాయ పంటలకు జీవామృతం, వేస్ట్ డీకంపోజర్, వర్మీవాష్, జీవన ఎరువులను డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు. జీవామృతాన్ని మాత్రం వడకట్టిన తర్వాత డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి. రసాయన ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తే అన్ని మొక్కలకు సరైన మోతాదులో అందుతుంది. దీంతో పంట ఏకరీతిగా ఉంటుంది. ద్రవ రూపంలో నత్రజని, భాస్వరం, పొటాషియం మాత్రమే కాకుండా సూక్ష్మపోషక పదార్థాలను అందించవచ్చు.
News February 17, 2026
418 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News February 17, 2026
అధిక మాసంలో శుభ కార్యాలు ఎందుకు నిషిద్ధం?

అధిక మాసంలో సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడు. అందుకే దీనిని ‘శూన్య మాసం’ అంటారు. ‘మైల మాసం’ అని కూడా పిలుస్తారు. శాస్త్రం ప్రకారం.. సూర్య గమనం లేని ఈ సమయంలో చైతన్యం తక్కువగా ఉంటుంది. ఫలితంగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు చేస్తే విఘ్నాలు ఎదురవుతాయని నమ్ముతారు. ఆశించిన ఫలితాలు దక్కవని పండితుల అభిప్రాయం. అందుకే ఈ మాసంలో లౌకిక శుభకార్యాలు పక్కన పెట్టాలని సూచిస్తున్నారు.


