News February 10, 2025
నులిపురుగులు ఎందుకు, ఎలా వస్తాయంటే?

AP: రాష్ట్ర వ్యాప్తంగా నేడు 1-19ఏళ్ల వారిలో నులిపురుగుల నివారణకు ప్రభుత్వం అల్బెండజోల్ మాత్రలు అందజేయనుంది. నులి పురుగులనేవి పేగుల్లోని పోషకాలతో అభివృద్ధి చెందే పరాన్నజీవులు. వీటితో అస్కారియాసిస్ అనే వ్యాధి వస్తుంది. ఫలితంగా చిన్నారుల్లో రక్తహీనత, పోషకాహార లోపం, కడుపునొప్పి, విరోచనాలు, బరువు తగ్గడం, తదితర ఆరోగ్య సమస్యలొస్తాయి. అపరిశుభ్రత, కలుషితమైన ఆహారం వల్ల నులిపురుగులు వ్యాప్తి చెందుతాయి.
Similar News
News February 10, 2026
రేపు ఉద్యోగులకు సెలవు

TG: రేపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ ఊరటనిచ్చింది. మున్సిపల్, కార్పొరేషన్లలో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ‘స్పెషల్ క్యాజువల్ లీవ్’ మంజూరు చేసింది. సెలవు లేదనే కారణంగా ఓటుకు దూరం కావొద్దని ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆఫీసులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇప్పటికే <<19099000>>సెలవు<<>> ఇచ్చిన విషయం తెలిసిందే.
News February 10, 2026
అల్లు అర్జున్ 42 రూల్స్ అంటూ ప్రచారం.. AA టీమ్ సీరియస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై బ్రాండ్ స్ట్రాటజిస్ట్ <<19101939>>కావేరీ బారువా<<>> చేసిన వ్యాఖ్యలపై AA టీమ్ స్పందించింది. ‘ఇటీవల అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. ఈ ఆరోపణలను మేము సీరియస్‌గా తీసుకున్నాం. బాధ్యులపై పరువునష్టం దావా వేసేందుకు మా లీగల్ టీమ్ సిద్ధమవుతోంది. ఇలాంటి ధ్రువీకరించని సమాచారాన్ని షేర్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం’ అని ప్రకటన విడుదల చేసింది.
News February 10, 2026
బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పరిశీలనలో ఉన్నాయి: కేంద్రం

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు తమ పరిశీలనలో ఉన్నాయని కేంద్రం తెలిపింది. విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచడంపై BJP ఎంపీ ఈటల రాజేందర్ లోక్‌సభలో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి బీఎల్ శర్మ పైవిధంగా సమాధానం ఇచ్చారు. అసెంబ్లీ కార్యదర్శి నుంచి 2 బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం వచ్చాయని వివరించారు.


