News October 8, 2025

గణపతి పూజలో తులసి ఆకులను ఎందుకు వాడరు?

image

తులసీ దేవి, గణేషుణ్ని చూసి తనను వివాహం చేసుకొమ్మని అడుగుతుంది. కానీ నిరాకరిస్తాడు. దీంతో ఆమె కోపంతో బ్రహ్మచారిగా ఉంటావని శపిస్తుంది. ప్రతిగా గణేషుడు ఆమెను రాక్షసుని చెంత ఉండమని శపించాడు. ఆయన శాపానికి చింతించిన ఆమె మన్నించమని అడిగింది. గణేషుడు శాంతించి పవిత్రమైన మొక్కగా జన్మిస్తావని వరమిస్తాడు. కానీ తన పూజలో ఆ పత్రం ఉండటాన్ని నిరాకరిస్తాడు. ఆయన పూజలో తులసి ఆకులు వాడితే పూజాఫలం దక్కదని ప్రతీతి.

Similar News

News January 18, 2026

పల్నాడులో YCP రక్తం పారిస్తే.. TDP నీళ్లు పారిస్తోంది: గొట్టిపాటి

image

AP: పల్నాడులో YCP హయాంలో రక్తం పారితే కూటమి ప్రభుత్వంలో సాగునీరు పారుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వ్యక్తిగత గొడవలకు రాజకీయ రంగు పులిమి YCP కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా <<18871169>>జగన్‌<<>>కు బుద్ధి రాలేదని, శవ రాజకీయాలకు పాకులాడుతున్నారని విమర్శించారు. అక్రమ సంపాదనతో పుట్టిన YCPకి, ఆత్మగౌరవం కోసం పెట్టిన TDPకి మధ్య తేడా ఉందన్నారు.

News January 18, 2026

కర్ణుడి దానగుణం: మానవత్వమే పరమార్థం

image

మహాభారత యుద్ధంలో కర్ణుడి దానపుణ్యమే అతడికి రక్షగా నిలిచింది. చివరి క్షణంలో కృష్ణుడు అడిగినప్పుడు కర్ణుడు తన పుణ్యఫలాన్ని కూడా దానమిచ్చాడు. వరం కోరమని అడగ్గా.. మరుజన్మలోనూ సాయం చేసే హృదయాన్నే కోరుకున్నాడు. ముక్తి కోసం దేవుడిని వెతకక్కర్లేదని, తోటివారికి సాయపడే గుణం ఉంటే ఆ దేవుడే మనల్ని చేరుకుంటాడని ఈ కథ నిరూపిస్తోంది. పరోపకారమే నిజమైన దైవారాధనని కర్ణుడి జీవితం చాటిచెబుతోంది.

News January 18, 2026

C-DOTలో సైంటిస్ట్ పోస్టులు

image

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(<>C-DOT<<>>) 10 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, MSc, ME/MTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్/ రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdot.in.