News October 8, 2025

చిన్న పిల్లలకు దిష్టి ఎందుకు తీస్తారు?

image

వేడుకలకు వెళ్లొచ్చిన తర్వాత పసుపు, సున్నం కలిపిన నీటితో చిన్నపిల్లలకు దిష్టి తీస్తుంటారు. దీని వెనుక సైన్స్ కూడా ఉందని పండితులు చెబుతున్నారు. ఫంక్షన్స్‌లో చుట్టాలు చిన్నపిల్లల చుట్టూ చేరుతారు. దీంతో పిల్లలు అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంటుంది. దిష్టి ద్వారా ఎరుపు నీటిని చూస్తే.. వారి మనసుకు ప్రశాంతత, ధైర్యం కలుగుతుందట. ఈ ఆచారం వారికి శుభాన్ని అందించి, హాయిగా నిద్రపోవడానికి తోడ్పడుతుందని నమ్మకం.

Similar News

News January 24, 2026

బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్: క్రిక్ బజ్

image

T20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను ICC చేర్చినట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. గ్రూప్-సిలోని ఇటలీ, నేపాల్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లతోపాటు స్కాట్లాండ్ కూడా ఉంటుందని పేర్కొంది. కాగా ఇరు దేశాల మధ్య కొంత కాలంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా <<18925836>>భారత్‌లో<<>> ఆడేది లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. BCB నిర్ణయంపై ఆ దేశ ప్లేయర్లూ <<18935631>>ఆందోళన <<>>వ్యక్తం చేశారు.

News January 24, 2026

స్కామ్ లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారు: హరీశ్

image

TG: భట్టి విక్రమార్క ఎన్ని సాకులు <<18943730>>చెప్పినా<<>> బొగ్గు కుంభకోణం, అందులో రేవంత్ బామ్మర్ది రింగ్‌మెన్ పాత్ర పోషించడం నిజమని హరీశ్ రావు ఆరోపించారు. లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు ‘భట్టి గారూ మీరంటే నాకు చాలా గౌరవం. దీనిపై సిట్టింగ్ జడ్జి, CBI విచారణ కోసమే కిషన్‌రెడ్డికి లేఖ రాశా. రేవంత్, అతని బామ్మర్దిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తానని హామీ ఇస్తే మీకూ లేఖ రాస్తా’ అని తెలిపారు.

News January 24, 2026

ESIC ఢిల్లీలో ఉద్యోగాలు

image

<>ESIC <<>>ఢిల్లీ 45 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 30న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS, MCh/DM, పీజీ డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. ఫుల్ టైమ్ స్పెషలిస్టుకు 69 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in/