News March 27, 2024
ఆ కంటైనర్ ఎందుకు తనిఖీ చేయలేదు: లోకేశ్

AP: రోజూ తన కాన్వాయ్ తనిఖీ చేసిన పోలీసులకు ఒక్క ఎన్నికల నిబంధన ఉల్లంఘన అయినా కనిపించిందా? అని నారా లోకేశ్ ప్రశ్నించారు. ‘సీఎం ఇంట్లోకి అన్ని నిబంధనలు అతిక్రమించి వెళ్లి వచ్చిన కంటైనర్‌ను ఎందుకు తనిఖీ చేయలేదు? అందులో ఏముంది? బ్రెజిల్ సరుకా? లిక్కర్లో మెక్కిన రూ.వేల కోట్లా? లండన్ పారిపోయేందుకు ఏర్పాట్లా? ఏపీ సెక్రటేరియట్‌లో ఇన్నాళ్లు దాచిన దొంగ ఫైళ్లా? సమాధానం చెబుతారా డీజీపీ?’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 11, 2026
పిల్లల్లో అధిక రక్తపోటు లక్షణాలు

ప్రస్తుతకాలంలో పిల్లలు, యుక్తవయస్సు వారిలోనూ హైబీపీ కనిపిస్తోంది. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో BP ఉంటే తలనొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వంశ చరిత్రలో BP ఉంటే పిల్లలకు ఆరేళ్లు దాటిన తర్వాత ఏడాదికోసారి BP చెక్ చేయడం మంచిది. జీవనశైలి మార్పులతో దీన్ని తగ్గించొచ్చని సూచిస్తున్నారు.
News February 11, 2026
పిల్లల్లో బీపీ ఉంటే ఎన్నో దుష్ప్రభావాలు

దీర్ఘకాలంగా అధిక రక్తపోటుతో బాధపడే పిల్లలకు గుండె కండరం మందం అయి గుండె వైఫల్యానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు. కిడ్నీలో రక్తనాళాలు దెబ్బతిని, వడపోత ప్రక్రియ అస్తవ్యస్తమవ్వచ్చు. కంట్లోని రెటీనా దెబ్బతినడం, మెదడుకు రక్త సరఫరా చేసే నాళాలు దెబ్బతిని తలనొప్పి, తలతిప్పు తలెత్తచ్చంటున్నారు. అంతేకాకుండా, రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం వంటి తీవ్ర సమస్యలూ ముంచుకురావొచ్చని వివరిస్తున్నారు.
News February 11, 2026
వందేమాతరం.. ఇకపై లేచి నిలబడాల్సిందే!

అధికారిక కార్యక్రమాలు, జెండా ఎగురవేసేటప్పుడు, రాష్ట్రపతి/గవర్నర్ ప్రసంగాల సమయంలో వందేమాతరం పూర్తి వెర్షన్‌ను పాడటం తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఒకే ఈవెంట్‌లో వందేమాతరం, జనగణమన పాడాల్సి వస్తే.. మొదట వందేమాతరమే పాడాలి. ఇది ప్లే అవుతున్నప్పుడు అందరూ లేచి నిలబడాలి. సినిమాలు, డాక్యుమెంటరీ లేదా న్యూస్‌రీల్ మధ్యలో వందేమాతరం వస్తే మాత్రం థియేటర్‌లో నిలబడాల్సిన అవసరం లేదు.


