News October 5, 2024

వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా సురేఖపై కామెంట్స్ ఎందుకు?: పొన్నం

image

TG: తన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ వెనక్కి తీసుకున్నా సినీ ఇండస్ట్రీ వాళ్లు ఆమెపై కామెంట్స్ చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆమె ఆవేశంలో మాట్లాడారని చెప్పారు. తన తప్పును గ్రహించి, వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారని తెలిపారు. అంతకంటే ముందు సురేఖపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్‌పైనా సినిమా వాళ్లు స్పందించి ఉంటే బాగుండేది అని పొన్నం అభిప్రాయపడ్డారు.

Similar News

News December 9, 2025

వంటింటి చిట్కాలు

image

* పాయసం చేసేటప్పుడు ఉప్పు కలిపితే రుచి పెరుగుతుంది.
* అన్నం అడుగంటకుండా ఉండాలంటే దానిలో నెయ్యి, కాస్త నిమ్మరసం కలిపితే సరి. అన్నం తెల్లగా, పొడిపొడిగానూ అవుతుంది.
* గ్రేవీ రుచి పెరగాలంటే మసాలా దినుసులను వేయించేప్పుడు అర చెంచా చక్కెర జత చేసి చూడండి. చక్కటి రంగుతోపాటు రుచి రెండింతలవుతుంది.
* ఉల్లిపాయలను, బంగాళాదుంపలను విడివిడిగా పెట్టకపోతే తేమ కారణంగా రెండూ పాడవుతాయి.

News December 9, 2025

స్వరాష్ట్ర కలను సోనియా సాకారం చేశారు: రేవంత్

image

TG: సరిగ్గా ఇదే రోజున 2009లో తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన ప్రకటన రాష్ట్ర ప్రజలకు సంతోషాన్నిచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వరాష్ట్ర కలను సోనియా సాకారం చేశారన్నారు. ఆ కారణంగానే ఈ రోజున తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు.

News December 9, 2025

ICSILలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

image

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(ICSIL)లో 6 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి డిసెంబర్ 9 ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 10న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.590. నెలకు జీతం రూ.24,356 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://icsil.in