News August 22, 2025

కొత్త అప్డేట్ ఎందుకంటే?

image

చాలా ఫోన్‌లలో గతంలోని ‘కాల్ ఇంటర్‌ఫేజ్’ ఇప్పుడు కనిపించడం లేదు. గూగుల్ ఫోన్ యాప్ ‘మెటీరియల్ 3 ఎక్స్‌ప్రెసివ్ రీడిజైన్‌’ను విడుదల చేయడమే <<17480188>>ఈ మార్పుకు<<>> కారణం. పాత డిజైన్ వల్ల జేబులో నుంచి ఫోన్ తీసేటప్పుడు అనుకోకుండా కాల్ ఆన్సర్ లేదా డిక్లైన్ అవుతోందని, దాన్ని పరిష్కరించేందు కొత్త డిజైన్ తీసుకొచ్చింది. స్వైప్ వద్దంటే Call Settingలోకి వెళ్లి Incoming call gestureలో Single tap ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.

Similar News

News January 15, 2026

సంక్రాంతి.. కోళ్లను ఇలా గుర్తించండి

image

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా చరిత్రలో కోడి పందేలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈకల రంగు, కాళ్ల రంగు, కళ్ల రంగును బట్టి వాటిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు.
#డేగ: ఎరుపు రంగు ఈకలు కలిగినవి.
#కాకి: నలుపు రంగు ఈకలు కలిగినవి.
#నెమలి: పచ్చని రంగు ఛాయ కలిగినవి.
#పర్ల: తెలుపు రంగు ఈకల మీద నల్లటి మచ్చలు ఉన్నవి.
#అబ్రాస్: ఎరుపు, తెలుపు, నలుపు కలిసిన మిశ్రమ రంగు.
#సేతు: పూర్తిగా తెల్లగా ఉండే కోడి.

News January 15, 2026

ఈ సంక్రాంతి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలి: మోదీ

image

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతా వైభవంగా జరుపుకొనే ఈ వేడుక అందరి హృదయాల్లో ఆనందాన్ని, కృతజ్ఞతా భావాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రకృతితో ప్రత్యేక అనుబంధం ఉండే ఈ పండుగ ప్రతిఒక్కరి జీవితంలో సుఖ శాంతులు, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగులో ట్వీట్ చేశారు.

News January 15, 2026

173 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

NCERTలో 173 గ్రూప్ A, B, C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.