News March 22, 2024
కేజ్రీవాల్ పిటిషన్లు ఎందుకు వెనక్కి తీసుకున్నారు?
తమ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ CM కేజ్రీవాల్ సుప్రీంలో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇటీవల కవిత సైతం ఇలాగే చేశారు. రౌస్ అవెన్యూ కోర్టుతో పాటు సుప్రీం కోర్టులోనూ విచారణ ఒకే రోజు ఉండటంతో పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు కేజ్రీవాల్ లాయర్ చెప్పారు. కాగా కవిత పిటిషన్‌పై స్పందించిన SC.. లోయర్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. తమ విషయంలోనూ ఇదే జరుగుతుందనే కేజ్రీవాల్ విత్‌డ్రా చేసుకున్నారని తెలుస్తోంది.
Similar News
News September 13, 2024
యూపీలో మరో మహిళపై తోడేలు దాడి
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో మరోసారి ఓ మహిళ(28)పై తోడేలు దాడి చేసింది. ఈ దాడిలో బాధితురాలి మెడ, ఛాతీకి తీవ్రగాయాలయ్యాయి. ఆరు తోడేళ్లలో అధికారులు ఐదింటిని పట్టుకోగా, మరొకటి ఎంత ప్రయత్నించినా దొరకడం లేదు. అది గత 4 రోజులుగా దాడులు చేస్తోంది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఆరో తోడేలును పట్టుకోవడం కష్టమవుతోందని అధికారులు వివరిస్తున్నారు.
News September 13, 2024
రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
TG: ఈ సారి పంట వేసిన రైతులకే రైతు భరోసా అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు ఈ నెలాఖరులోపు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరాకు రూ.7,500 చొప్పున రెండు విడతల్లో ఏడాదికి రూ.15,000 అందించాల్సి ఉంది.
News September 13, 2024
పోర్ట్‌బ్లెయిర్ ఇకపై ‘శ్రీ విజయపురం’: అమిత్ షా
పోర్ట్‌బ్లెయిర్ పేరును ‘శ్రీ విజయ పురం’గా మారుస్తున్నామని HM అమిత్‌షా అన్నారు. వలస వారసత్వం నుంచి విముక్తి కల్పించాలన్న ప్రధాని మోదీ ఆశయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్వీట్ చేశారు. ‘భారత స్వాతంత్ర్య చరిత్రలో A&N దీవులది ప్రత్యేక పాత్ర. ఒకప్పటి చోళుల నేవీ స్థావరం ఇప్పుడు భారత సైన్యానికి వ్యూహాత్మకం. నేతాజీ మొదట తిరంగా జెండాను ఎగరేసింది, వీర సావర్కర్ జైలుశిక్ష అనుభవించింది ఇక్కడే’ అని అన్నారు.