News March 28, 2024
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగిస్తారా?

ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ ED కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ మ.2 గంటలకు ఆయనను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కస్టడీని పొడిగించాలని కోరే అవకాశాలున్నాయి. లేదంటే ఆయనను రిమాండ్‌కు తరలించాలని కోర్టు ఆదేశిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఏప్రిల్ 3కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే కేసులో MLC కవిత జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
Similar News
News February 17, 2026
కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే?

కొందరిలో కనుబొమ్మలు చాలా పలుచగా ఉంటాయి. వాటిని పెంచడానికి ఈ టిప్స్..* కనుబొమ్మలపై రోజూ ఆముదం నూనెను రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. * తాజా కలబంద జెల్ ను కనుబొమ్మలపై రాసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. * కొబ్బరి నూనెలో రోజ్‌మేరీ నూనెను కలిపి కనుబొమ్మలపై మర్దనా చేస్తే ఒత్తుగా పెరుగుతాయి.
News February 17, 2026
‘ఫర్టిగేషన్’తో సాగులో మరిన్ని లాభాలు

నీటితో పాటు ద్రవరూపంలో ఉన్న ఎరువులను నిర్ణీత మోతాదులో కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించే విధానాన్ని ‘ఫర్టిగేషన్’ అంటారు. ఈ విధానంలో నీటిలో కరిగే రసాయన, సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి. పండ్లు, కూరగాయలు, పూల తోటలతో పాటు పత్తి, చెరకు, అరటి, మిరప, ఔషధ మొక్కల సాగుకు ఇది అనుకూలం. ఫర్టిగేషన్‌లో తక్కువ నీటితో సరైన మోతాదులో ఎరువులను అందించి లాభసాటి వ్యవసాయం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
News February 17, 2026
T20 WC: నేడు తేలనున్న ఆసీస్ భవితవ్యం

T20 WCలో ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి. 11AMకు న్యూజిలాండ్-కెనడా, 3PMకు ఐర్లాండ్- జింబాబ్వే, 7PMకు స్కాట్లాండ్-నేపాల్ తలపడనున్నాయి. కెనడాపై గెలిస్తే న్యూజిలాండ్ S-8కు వెళ్లనుంది. మరోవైపు ఐర్లాండ్‌పై జింబాబ్వే గెలిస్తే ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. స్కాట్లాండ్, నేపాల్ ఇప్పటికే ఎలిమినేట్ అయ్యాయి. ఇప్పటిదాకా ఇండియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, శ్రీలంక S-8కు అర్హత సాధించాయి.


