News April 20, 2024
ఓటింగ్ శాతం పెరిగేనా?

లోక్‌సభ తొలి దశ ఎన్నికల్లో 62.37 శాతం పోలింగ్ నమోదైంది. చివరి 12 దఫాల ఎన్నికలను పరిశీలిస్తే పోలింగ్ శాతం 60 నుంచి 70శాతం మధ్యనే ఉంటోంది. వీటిలో 1991లో అత్యల్పంగా 55.9శాతం నమోదు కాగా, 2019లో అత్యధికంగా 67.4శాతం నమోదయ్యింది. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమైన రాష్ట్రాల్లో పోలింగ్ ఇంకా జరగాల్సి ఉండగా.. కొత్త రికార్డులు నమోదవుతాయేమో వేచి చూడాలి.
<<-se>>#Elections2024<<>>
Similar News
News December 12, 2025
డెలివరీ కోసమే అయితే వీసాలివ్వం: US ఎంబసీ

తమ దేశ పౌరసత్వం కల్పించడంపై అమెరికా మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. USలో బిడ్డకు జన్మనివ్వడానికి టూరిస్ట్ వీసాకు అప్లై చేస్తే నిరాకరించనున్నట్లు INDలోని US ఎంబసీ తెలిపింది. USలో జన్మిస్తే సహజ సిద్ధంగా పౌరసత్వం వస్తుందని కొందరు ప్రయత్నిస్తారని, ఆ అడ్డదారులను మూసేస్తున్నట్లు తెలిపింది. పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నట్లు సూచన ప్రాయంగా తెలిసినా అలాంటి వీసా దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు చెప్పింది.
News December 12, 2025
ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

AP: అల్లూరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు <<18539107>>ప్రమాదంపై<<>> సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు తక్షణమే ఘటనాస్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
News December 12, 2025
మహిళల్లో ఐరన్ లోపం లక్షణాలివే..

మహిళల్లో ఐరన్ లోపం ఉంటే అలసట, బలహీనత ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జుట్టు ఎక్కువగా రాలడం కూడా ఐరన్ లోపానికి సంకేతాలే. దీన్ని తగ్గించడానికి పాలకూర, బీట్‌రూట్, పప్పులు, మాంసం, గుడ్లు, డ్రై ఫ్రూట్స్, విత్తనాలు తీసుకోవాలి. అలాగే టమిన్-సి ఐరన్ శోషణకు సహాయపడుతుంది. నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ వంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.


