News August 22, 2024
త్వరలో ఇక్రిశాట్ క్యాంపస్‌ను సందర్శిస్తా: సీఎం రేవంత్

TG: వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలపై పరిశోధనలను ముమ్మరం చేయాలని ఇక్రిశాట్ సంస్థకు CM రేవంత్ సూచించారు. ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డా.జాక్వెలిన్ హ్యూ ఇవాళ ఆయనతో భేటీ అయ్యారు. ఇక్రిశాట్ క్యాంపస్‌ను సందర్శించాలని ఆమె కోరగా, త్వరలోనే సందర్శిస్తానని CM తెలిపారు. ఇక్రిశాట్ సేవలను మరింత విస్తృతం చేయడం ద్వారా వ్యవసాయ రంగానికి మరింత మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
Similar News
News January 23, 2026
ఒక్కరోజులో 5.38 లక్షల మంది విమానయానం

దేశీయ విమానయానంలో 2025 NOV 23వ తేదీ రికార్డు సృష్టించింది. ఈ ఒక్కరోజే 5,38,249 మంది ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించారు. 3,356 విమానాలు దేశంలో రాకపోకలు సాగించాయి. గత 3 ఏళ్లలో రోజువారీ 5 లక్షల మందికి పైగా ప్రయాణించిన సందర్భాలున్నాయని విమానయాన శాఖ పేర్కొంది. కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటు, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి చోట్ల రీజనల్ కనెక్టివిటీ పెరగడం దీనికి కారణంగా వివరించింది.
News January 23, 2026
Plz.. ఆ రీల్‌కు పిల్లల్ని దూరంగా ఉంచండి: అనిల్ రావిపూడి

తన డైరెక్షన్‌లోని లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ పాపులర్ డైలాగ్స్‌లో ‘మద్యపానం మహదానందం’ ఒకటని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ఇన్‌స్టాలో ఇది విపరీతంగా వైరల్ అవుతోందని, ఇన్‌స్టాలో వెరైటీగా రీల్స్ వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. అయితే పిల్లలకు మాత్రం దీన్ని చూపించొద్దని, వారిచే దానిపై రీల్ చేయించొద్దని కోరారు.
News January 23, 2026
Paytm షేర్ విలువ 10% డౌన్.. కారణమిదే

Paytm మాతృసంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్’ షేర్లు ఒక్కరోజే 10% పడిపోయి ₹1,134కు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్’ (PIDF) పథకం 2025 డిసెంబర్ తర్వాత కొనసాగుతుందో లేదో అన్న ఆందోళనే ఇందుకు కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. Paytm లాభాల్లో ఈ పథకం ద్వారా వచ్చే ప్రోత్సాహకాలే 20% వరకు ఉంటాయని అంచనా. దీనిపై RBI నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.


