News July 6, 2024

భార్యను విడిచి సియాచిన్‌కు వెళ్లిన 15 రోజుల్లోనే!

image

వీరజవాన్ <<13574469>>అన్షుమన్<<>> సింగ్‌‌ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. పంజాబ్ రెజిమెంట్ 26వ బెటాలియన్‌కు చెందిన ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో అన్షుమన్ సింగ్ కెప్టెన్‌గా పనిచేశారు. గతేడాది FEB 10న సృష్టి సింగ్‌తో ఆయన వివాహం జరగ్గా 4 నెలల తర్వాత సియాచిన్‌కు వెళ్లి 15 రోజుల్లోనే చనిపోయారు. 2023 JULY 19న ఆర్మీ బంకర్లలో మంటలు ఏర్పడటంతో నలుగురిని కాపాడి మెడికల్ బాక్సులు తీసుకొచ్చేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు.

Similar News

News December 5, 2025

రాబోయే పది రోజులు తీవ్ర చలి!

image

TG: రాబోయే 10 రోజుల్లో రాష్ట్రంలో తీవ్ర చలి గాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి బలమైన చలి గాలులు ప్రారంభమవుతాయని తెలిపారు. హైదరాబాద్‌లో రేపటి నుంచి చలి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.

News December 5, 2025

మీ పిల్లల స్టడీ టేబుల్‌పై ఇవి ఉన్నాయా?

image

పిల్లలు ఏకాగ్రతగా చదవాలంటే చక్కని స్టడీ టేబుల్ కీలకం. సరైన వెలుతురు ఇచ్చే డెస్క్ ల్యాంప్, పెన్సిల్/పెన్ హోల్డర్ ఫోకస్‌ పెంచుతాయి. మంచి కొటేషన్లు పిల్లలను మోటివేట్ చేస్తాయి. స్టడీ ప్లానర్ ఉంటే టైమ్ మేనేజ్‌మెంట్ నేర్పుతుంది. వాటర్‌ బాటిల్‌ పెట్టుకోవడం మంచిది. ఎక్కువ సౌండ్ చేయని గడియారం టేబుల్‌పై పెట్టుకోండి. ఒక చిన్న మొక్క ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

News December 5, 2025

ప్రెగ్నెన్సీలో ఇది ప్రాణాంతకం

image

బిడ్డకు జన్మనివ్వడం ప్రతి మహిళకూ పునర్జన్మలాంటిది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని కాంప్లికేషన్లు వచ్చి ప్రాణాలు కోల్పోతారు. వాటిల్లో ఒకటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం. దీనివల్ల గర్భంలోని ఉమ్మనీరు తల్లి రక్తంలో కలిసిపోతాయి. దీంతో శరీరం ప్రతిస్పందిస్తుంది. దీంతో ఊపిరి ఆడకపోవడం, బీపీ పెరగడం, గుండెకు రక్తసరఫరా ఆగిపోవడం, అధిక రక్తస్రావం జరిగి కొద్ది సమయంలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.