News December 1, 2025

WNP: అధికారులు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి

image

ఎన్నికల్లో ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారుల పాత్ర కీలకమని, తమ విధులు,బాధ్యతలపై పూర్తి అవగాహన పెంచుకుని పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం మదనాపురం జెడ్పి బాయ్స్ హైస్కూల్ నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

Similar News

News February 16, 2026

రాజమండ్రి: పోలీస్ పీజీఆర్ఎస్‌కు 24 ఫిర్యాదులు

image

రాజమండ్రిలోని తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 24 మంది తమ అర్జీలను దాఖలు చేశారు. ఎస్పీ నరసింహ కిషోర్ బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యల పరిష్కారంపై సంబంధిత స్టేషన్లకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. చట్టపరిధిలో బాధితులకు న్యాయం జరిగేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

News February 16, 2026

బడ్జెట్ సెషన్ రెండో దశలో అమరావతి బిల్లు?

image

AP శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించేలా విభజన చట్ట సవరణ బిల్లుపై కసరత్తు చురుగ్గా సాగుతోంది. పార్లమెంటు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల రెండో దశలో దీన్ని ప్రవేశపెడతారని TDP వర్గాలు పేర్కొంటున్నాయి. టెక్నికల్, లీగల్ అంశాలపై న్యాయ, పట్టణ గృహనిర్మాణ, నీతి ఆయోగ్‌లకు హోమ్ శాఖ నోట్‌ను పంపింది. అనంతరం క్యాబినెట్ ఆమోదంతో బిల్లును పార్లమెంటులో పెడతారు. కాగా CM CBN ఈ బిల్లుపై కేంద్ర మంత్రి అమిత్ షాను కోరారు.

News February 16, 2026

ఆటో డ్రైవర్ To కొత్తగూడెం మేయర్

image

సాధారణ ఆటో డ్రైవర్‌గా జీవితం ప్రారంభించిన మూడ్ గణేశ్ కొత్తగూడెం మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎంపీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి, పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేసి ప్రజల మెప్పు పొందారు. కాంగ్రెస్-సీపీఐ పొత్తులో భాగంగా 20వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచిన ఆయనను మేయర్ పదవి వరించింది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మారిన కొత్తగూడెం మొదటి మేయర్‌గా గణేశ్‌ ప్రమాణస్వీకారం చేశారు.