News October 4, 2025
WNP: ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి రద్దు- కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయి, కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలంతా గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు ఎవరూ రావొద్దని తెలిపారు.
Similar News
News January 16, 2026
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం

శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ విమాన టికెట్ల ఉదంతం కలకలం రేపింది. ఖతర్ ఎయిర్ లైన్స్ విమానంలో దోహా వెళ్లేందుకు సిద్ధమైన 8 మంది ప్రయాణికుల టికెట్లు నకిలీవని తేలాయి. ఈ నకిలీ టికెట్ల వెనుక ఏవరైనా ఏజెంట్ల హస్తం ఉందా? లేదా ట్రావెల్ ఏజెన్సీల మోసమా? అనే కోణంలో శంషాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
News January 16, 2026
నిర్మల్: సదర్మాట్ బ్యారేజీ నిర్మాణానికి 1176 ఎకరాల సేకరణ

సదర్మాట్ బ్యారేజీ ద్వారా ఉమ్మడి ADB, NZB, KNR జిల్లాల రైతులకు సాగునీరు అందనుంది. 1.58 TMCల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మొత్తం 1176 ఎకరాల భూమిని సేకరించింది. ఇందులో NRML జిల్లాలో 805, JGTL జిల్లాలో 317 ఎకరాలు ఉన్నాయి. ఈ బ్యారేజీ ద్వారా 13,210 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు, JGTL జిల్లాలోని 4,896 ఎకరాలకు నీరు అందుతుంది. బ్యాక్ వాటర్ ద్వారా NZB జిల్లా లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం కలగనుంది.