News December 3, 2025

WNP: ఒకే వార్డుకు తండ్రికొడుకులు పోటీ

image

ఖిల్లాగణపురం మండలం మామిడిమాడ గ్రామపంచాయతీ నాలుగో వార్డుకు తండ్రి కొడుకులు పోటీపడుతున్నారు. కొడుకు ఏ సాయికుమార్ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉండగా, తండ్రి తిరుపతయ్య కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. తండ్రి కొడుకుల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి ఓటర్లలో నెలకొంది.

Similar News

News February 11, 2026

HYD: ‘అ’క్షరం.. ‘ఆ’కలి దుఃఖంలో కలిశాయి!

image

పాఠశాల ముగియగానే పిల్లలు గంతులేసుకుంటూ ఇళ్లకు వెళ్లి ఆడుకుంటారు. కానీ, మాదాపూర్‌లోని ఈ చిన్నారి కథ వేరు. స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్లకుండా, నేరుగా తల్లి కూర్చునే ఫుట్‌పాత్ వద్దకు వెళ్తుందా పాప. చెప్పులు కుట్టడంలో తల్లికి సాయం చేస్తూ, కస్టమర్లు లేని సమయంలో హోంవర్క్ రాస్తోంది. చదవడానికి ఇంట్లో కనీస వసతులు లేకపోయినా, వీధి దీపాల వెలుతురులో చదువుతోంది. ఈ బుజ్జితల్లి ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుందాం.

News February 11, 2026

SRPT: ఓటు వేయడానికి తరలిరండి: కలెక్టర్

image

మున్సిపాలిటీలో ఎన్నికలలో ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించు కోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు బాధ్యతగా ఉండాలని, పార్టీలతో సంబంధం లేకుండా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన పోలింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

News February 11, 2026

HYD: ‘అ’క్షరం.. ‘ఆ’కలి దుఃఖంలో కలిశాయి!

image

పాఠశాల ముగియగానే పిల్లలు గంతులేసుకుంటూ ఇళ్లకు వెళ్లి ఆడుకుంటారు. కానీ, ఈ చిన్నారి కథ వేరు. స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్లకుండా, మాదాపూర్‌లోని BIG C ముందు తల్లి కూర్చునే ఫుట్‌పాత్ వద్దకు వెళ్తుందా పాప. చెప్పులు కుట్టడంలో తల్లికి సాయం చేస్తూ, కస్టమర్లులేని సమయంలో హోంవర్క్ రాస్తోంది. చదవడానికి ఇంట్లో కనీస వసతులు లేకపోయినా, వీధి దీపాల వెలుతురులో చదువుతోంది. ఈ బుజ్జితల్లి ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుందాం.