News October 8, 2025
WNP: పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ

వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. కోర్టు కేసుల్లో నిందితులకు శిక్షలు పడితేనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ఎస్పీ అన్నారు. కేసులు పెండింగ్‌లో లేకుండా త్వరగా పరిష్కరించి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Similar News
News January 17, 2026
పాలమూరుకు కేసీఆర్ ఒక్క ప్రాజెక్టు సాధించలేదు: CM రేవంత్

TG: పదేళ్ల BRS ప్రభుత్వ హయాంలో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని MBNR జిల్లా పర్యటన సందర్భంగా CM రేవంత్ విమర్శించారు. ‘దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా అందులో పాలమూరు బిడ్డల శ్రమ ఉంది. కానీ ఈ జిల్లాకు KCR ఒక్క ప్రాజెక్టు సాధించలేదు. పాలమూరు-RR పేరిట రూ.23వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించినా ఎత్తిపోతలు పూర్తి చేయలేదు. ఉదండాపూర్ భూనిర్వాసితులకు నిధులు చెల్లించలేదు’ అని ఆరోపించారు.
News January 17, 2026
పాస్ పుస్తకంతో సులభంగా భూమి వివరాలు: జేసీ

రైతులు తమ భూమికి సంబంధించిన వివరాలను పాసు పుస్తకాల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఆచంట మండలం పెనుమంచిలి గ్రామ సచివాలయం వద్ద జరిగిన గ్రామ సభలో జేసీ పాల్గొన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలను పరిశీలించారు. గ్రామ సభకు హాజరైన రైతులతో ఆయన మాట్లాడారు. రైతుల సందేహాలను నివృత్తి చేసి, పలు సూచనలు చేశారు.
News January 17, 2026
PHOTOS: HYDలో అబ్బురపరిచే హాట్ ఎయిర్ బెలూన్ షో

TG: హైదరాబాద్‌లో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో 18 బెలూన్స్ గాల్లో సందడి చేస్తున్నాయి. గోల్కొండ వద్ద ఆకాశం నుంచి తీసిన ఫొటోలు అబ్బురపరుస్తున్నాయి. అటు ఇవాళ ఉదయం ఓ బెలూన్ సాంకేతిక సమస్యతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందన్న వార్తలను నిర్వాహకులు ఖండించారు. అందులో వాస్తవం లేదన్నారు.


