News December 1, 2025

WNP: పోలీసుల కర్తవ్యం నిబద్ధత ప్రశంసనీయమైనది: ఎస్పీ

image

శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి కర్తవ్య నిబద్ధత ప్రశంసనీయమైనదని వనపర్తి ఎస్పీ సునీత రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరులో సీఎం పర్యటన విజయవంతానికి కృషి చేసిన అధికారులకు సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, పూర్తి శాంతియుత వాతావరణంలో సీఎం పర్యటన జరిగిందని సహకరించిన పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News February 17, 2026

పెద్దపల్లి: గ్రామాల్లో నిబంధనల ప్రకారమే పాలన: కలెక్టర్

image

గ్రామ పంచాయతీల్లో నిబంధనల మేరకే పాలన సాగాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో 3వ విద్యుత్ వైరు ఏర్పాటు చేయాలని, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రోడ్లపై చెత్త లేకుండా చూడాలని, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీపీఓ వీర బుచ్చయ్య పాల్గొన్నారు.

News February 17, 2026

జడ్చర్ల: ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. యువకుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గంగాపూర్ గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో వాహనంపై ప్రయాణిస్తున్న మిడ్జిల్ మండలం రాణి పేట గ్రామానికి చెందిన బోయ శివ(26) అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తి రజని (26) కి తీవ్ర గాయాలు కాగా 108లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News February 17, 2026

వరంగల్ కమిషనరేట్‌కు 11 పతకాలు

image

సైబరాబాద్ కమిషనరేట్లో నేటి నుంచి ప్రారంభమైన 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీలలో తొలిరోజు నిర్వహించిన పోటీలలో వరంగల్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులు మొత్తం 11 పతకాలను సాధించారు. ఇందులో ఒకటి గోల్డ్ మెడల్, ఐదు సిల్వర్ మెడల్స్ మరో ఐదు బ్రాంజ్ మెడల్స్ సాధించి పతకాల పట్టికలో రెండవ స్థానంలో నిలించింది.