News February 6, 2025

WNP: బైక్‌, లారీ ఢీ.. ఒకరి దుర్మరణం

image

బైక్‌ని లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పాన్‌గల్ మండలం రేమొద్దులకి చెందిన నర్సింహారెడ్డి(55) తన సొంత పనుల మీద బైక్‌పై విలియంకొండకు వచ్చారు. తిరిగి ఇంటికెళ్తుండగా.. కొత్తకోట మదర్‌థెరిసా జంక్షన్ వద్ద ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. కేసు నమోదైంది.

Similar News

News January 14, 2026

భోగి పండ్లు ఎలా, ఎప్పుడు పోయాలి?

image

భోగి సందర్భంగా ఇవాళ చిన్నారులపై భోగి పండ్లు పోసే సంప్రదాయం తరతరాలుగా వస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం మేరకు.. చెరకు ముక్కలు, రేగి పండ్లు, పైసలు కలిపి పిల్లలను కూర్చోబెట్టి దిగదుడుపు తీసి తలమీద నుంచి కిందకు వదిలేయాలి. దీంతో భోగి పీడ తొలగిపోయి వాళ్లు భోగం అనుభవించడానికి కావలసిన శక్తిని పొందుతారు. అయితే సాయంత్రం వేళ వీటిని పోస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు.

News January 14, 2026

ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ నుంచి ‘SIR’

image

AP, TGలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను ఏప్రిల్, మే నెలల్లో పూర్తి చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. బిహార్‌లో తొలి దశ ముగియడంతో రెండో దశను 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్, TN, UP, WB సహా పలు ప్రాంతాల్లో ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీంతో మూడో దశలో ఏపీ, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ‘సర్’ చేపట్టనున్నారు.

News January 14, 2026

మెట్రో మార్కు చిత్రకళ.. ‘పరిచయ్’ అదిరింది బాసూ!

image

మెట్రో రైలును పట్టాలెక్కించినట్టే చిత్రకారుల ప్రతిభను ప్రపంచానికి చాటాలంటున్నారు NVS రెడ్డి. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘పరిచయ్ ఆర్ట్ ఫౌండేషన్’ నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్, క్యాంప్ కళాభిమానులను ఫిదా చేస్తోంది. ఒకేచోట ప్రదర్శన, ప్రత్యక్ష చిత్రలేఖనం చూడటం అరుదైన అవకాశమని చెప్పుకొచ్చారు. జయవంత్ నాయుడు ఆధ్వర్యంలో 12 మంది దిగ్గజ చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన అద్భుతాలు ఇక్కడ కొలువుదీరాయి.