News September 11, 2025
WNP: భూభారతి పెండింగ్ అర్జీలను పరిష్కరించాలి

భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన పెండింగ్ అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్‌లో తాహశీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2020 అక్టోబర్ 12 నుంచి 2020 నవంబర్ 10 వరకు వచ్చిన సాదా బైనామాలను మాత్రమే నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News December 11, 2025
నిర్మల్ జిల్లాలో తొలి విజయం మహిళదే

నిర్మల్ జిల్లా మామడ మండలం ఆదర్శ నగర్ సర్పంచ్‌గా బర్కుంట లక్ష్మి ప్రత్యర్థి నల్ల రుక్మపై 9 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలవగా ఆదర్శ నగర్ ఫలితాలు విడుదలయ్యాయి.
News December 11, 2025
MHBD: జిల్లా వ్యాప్తంగా 86.99 శాతం ఓటింగ్

జిల్లాలోని ఐదు మండలాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అత్యధికంగా నమోదైంది. జిల్లా సగటు 86.99గా అధికారులు వెల్లడించారు. అత్యధికంగా కేసముద్రంలో 88.27, మహబూబాబాద్‌లో 87.78, నెల్లికుదురులో 87.05 చొప్పున పోలింగ్ నమోదైంది. ఒంటి గంట తర్వాత కూడా క్యూలో ఉన్న ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు.
News December 11, 2025
మంథనిలో అత్యధికం… రామగిరిలో అత్యల్పం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో పెద్దపల్లి జిల్లాలోని 5 మండలాలకు ఈరోజు ఎన్నికలు జరిగాయి. ఇందులో మంథని మండలంలో అత్యధికంగా 84.39 శాతం, రామగిరి మండలంలో అత్యల్పంగా 77.96 శాతం పోలింగ్ నమోదయ్యింది. మంథనిలో 33,861 ఓటర్లకు గాను 28,575 ఓట్లు పోలయ్యాయి. రామగిరి మండలంలో 31,832 ఓటర్లకు గాను 24,815 ఓట్లు పోలయ్యాయి.


