News August 14, 2025

WNP: ముగ్గురు కొడుకులు ఉన్న అమ్మ అనాధే..!

image

ముగ్గురు కుమారులు ఉన్న బస్టాండ్‌లో చలికి వణుకుతూ వర్షానికి తడుస్తూ ఓ అమ్మ దీనస్థితిలో జీవనం కొనసాగిస్తుంది. కన్నీళ్లు తెప్పించే ఈ ఘటన వీపనగండ్లలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఈడిగ బాలమ్మకు పెద్దయ్యగౌడ్, అర్జునయ్య, వెంకటయ్యగౌడ్ కుమారులున్నారు. తల్లిని చూసుకోకపోవడంతో బస్టాండ్‌లో జీవనం వెళ్లదీస్తుంది. కలెక్టర్, ఎస్పీ ఆదేశాలతో సఖీ సెంటర్ నిర్వాహకులు WNPలోని ఓల్డ్ ఏజ్ హోమ్‌కు తరలించారు.

Similar News

News March 13, 2026

తిరుపతిలో చిన్నారి మృతిపై కలకలం

image

తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో శిశువు మృతి కలకలం రేపింది. నగరంలోని చెన్నారెడ్డి కాలనీ చెందిన జానకి 3రోజుల క్రితం పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరారు. ఈక్రమంలో బుధవారం మగ బిడ్డకు జన్మనిచ్చారు. తన బిడ్డకు గురువారం రాత్రి టీకా వేశారని.. శరీరం నీలి రంగుగా మారి చనిపోయినట్లు తల్లి ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృత శిశువుతో ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.

News March 13, 2026

KNR: ఉమ్మడి జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురి మృతి

image

ఉమ్మడి KNR జిల్లాలో నిన్న వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు మృతి చెందారు. జమ్మికుంటలోని ఆర్‌వోబీ ఫ్లైఓవర్‌పై నుంచి దూకి <<19365742>>రాం శివరాజ్<<>>(28), ధర్మారం(M) నర్సింహులపల్లికి చెందిన <<19364283>>శంకరయ్య<<>>(73), కోనాయిపల్లి శివారులో <<19367858>>రాజూరి వీరాచారి<<>>(40), జమ్మికుంటకు చెందిన <<19367714>> కర్రయ్య<<>>లు ఉరి వేసుకొని, మంథని మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<19368176>>గోబు తిరుపతి<<>>(30) మృతి చెందారు.

News March 13, 2026

బాపట్ల: టెన్త్ విద్యార్థులకు గమనిక

image

​పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థులకు కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని బాపట్ల DEO శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. పరీక్ష కేంద్రాలను తెలుసుకునేందుకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా హాల్‌టికెట్లపై (QR) కోడ్‌ను అందిస్తున్నామన్నారు. మొబైల్‌లో దీన్ని స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా, రూట్ మ్యాప్, పాఠశాల చిత్రం కనిపిస్తాయని పేర్కొన్నారు.