News December 2, 2025
WNP: రేపటి నుంచి మూడో దశ పంచాయతీ నామినేషన్లు

మూడో దశ గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈనెల 3 నుంచి ప్రారంభం కానుంది. వనపర్తి జిల్లాలోని చిన్నంబావి, వీపనగండ్ల, పానగల్, శ్రీరంగాపూర్, పెబ్బేరు మండలాల్లో మొత్తం 87 పంచాయతీలలో 806 వార్డులకు నామినేషన్ల అభ్యర్థులు వేరు ఉన్నారు. అధికారులు ఐదు మండలాలలో 34 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే మండలాల్లో కొన్ని గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక జోరుగా కొనసాగుతుంది.
Similar News
News February 7, 2026
నిర్మల్: అంతా వారి డైరెక్షన్‌లోనే ప్రచారం..!

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. BRS, BJP, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అన్ని వార్డుల్లో అభ్యర్థులను గెలిపించేందుకు ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రధాన పార్టీలు ఇప్పటికే ఆయా వార్డుల్లో అభ్యర్థులకు ఇన్‌ఛార్జ్‌లను కేటాయించారు. ఎప్పటికప్పుడు ప్రచార శైలిని, ఓటరు నాడిని పరిశీలిస్తూ ముందుకు నడిపిస్తున్నారు.
News February 7, 2026
ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి: ఎస్పీ జానకి షర్మిల

పోలీసులు ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన వీక్లీ పరేడ్‌లో మాట్లాడారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి శాఖ ప్రతిష్ఠను కాపాడాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కుటుంబంతో గడపాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
News February 7, 2026
ఆరోగ్యంగా ఉంటేనే విధుల్లో రాణించగలరు: ఎస్పీ

పోలీసులకు విధి నిర్వహణ ఎంత ముఖ్యమో ఆరోగ్య పరిరక్షణ, క్రమశిక్షణ, ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యమని ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన వీక్లీ పరేడ్‌లో మాట్లాడారు. సిబ్బంది సమయం దొరికినప్పుడు వ్యాయామం చేయాలని, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలన్నారు. ఫిట్నెస్‌తోనే సమర్థవంతంగా విధులు నిర్వహించగలమని, మంచి జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.


