News September 10, 2025

WNP: ‘హాస్టల్స్‌కు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి’

image

జిల్లాలోని హాస్టళ్లకు సరఫరా చేస్తున్న సన్న బియ్యం నాణ్యంగా ఉండాలని వనపర్తి జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారాం సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం ఆయన ఎంఎల్‌ఎస్‌ పాయింట్ ఇన్‌చార్జులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించిందని, ఈ విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News December 12, 2025

ఘోరం.. బాలిక చెవి కొరుక్కుతిన్న కుక్క

image

AP: నంద్యాల జిల్లా ఆత్మకూరులో 4 ఏళ్ల చిన్నారిపై వీధికుక్క పాశవికంగా దాడి చేసింది. ఆసియా అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా దాడి చేసి చెవిని కొరుక్కుతింది. చెంపతో పాటు ఇతర శరీర భాగాలపైనా తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
* పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి

News December 12, 2025

రాజాపూర్: MLA అహంకారానికి హెచ్చరిక: ఎంపీ

image

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంతూరులో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఓటమి పాలుకావడం ఆయన అహంకారానికి ప్రజలు ఓటుద్వారా చేసిన హెచ్చరిక అని ఎంపీ డీకే అరుణ అన్నారు. రంగారెడ్డిగూడెంలో సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన ఆనంద్ రేవతిని ఎంపీ అభినందిస్తూ, శాలువాతో సన్మానించారు. గ్రామాభివృద్ధికి భవిష్యత్తులో మరింత కృషిచేయాలని సూచించారు. తన పూర్తి సహకారం ఉంటుందని డీకే అరుణ హామీ ఇచ్చారు.

News December 12, 2025

ప్రతి గర్భిణీని మొదటి 3 నెలల్లో తప్పక నమోదు చేయాలి: DMHO

image

గర్భిణీ స్త్రీలు మొదటి 3 నెలలలోపే తప్పక నమోదు చేయించుకోవాలని DMHO విజయమ్మ తెలిపారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో జరిగిన శిశు మరణాలపై సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. నమోదు చేసినప్పటి నుండి వారికి అవసరమైన అన్ని వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఏడో నెలలో బర్త్ ప్లాన్ ఇవ్వాలన్నారు. నవజాత శిశువు సంరక్షణపై ముందుగానే అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.