News November 2, 2025
WNP: భర్త వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి(D) పెబ్బేరులో జరిగింది. ‘మహేందర్, సువర్ణ చెలిమిళ్లలో నివాసముంటున్నారు. భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకొని సువర్ణను నిత్యం మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. శుక్రవారం కూడా అతడు భార్యతో గొడవపడ్డాడు. మనస్థాపానికి గురైన సువర్ణ ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది’ అని పోలీసులు తెలిపారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News November 2, 2025
నాకు ప్రాణ భయం.. భద్రత పెంచండి: తేజ్ ప్రతాప్

బిహార్ ఎన్నికల వేళ లాలూ పెద్ద కుమారుడు, JJD చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ శత్రుత్వంతో తనపై హత్యాయత్నం జరిగే అవకాశం ఉందన్నారు. తనకు ప్రాణభయం ఉందని, భద్రత మరింత పెంచాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. ఇటీవల దుండగుల కాల్పుల్లో జన్‌సురాజ్ కార్యకర్త మరణించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కుటుంబ విభేదాల నేపథ్యంలో తేజ్ ప్రతాప్‌ను RJD నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.
News November 2, 2025
అచ్చంపేట: బండపై 1000 ఏళ్లనాటి పాదాలు, శివలింగం

అచ్చంపేట పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండనాగుల గ్రామ శివారులో ఉన్న శివాలయం ఎదుట ఉన్న బండపై 1000 క్రితం నాటి పాదాలు, శివలింగాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పురావస్తు పరిశోధకులు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ శివ నాగిరెడ్డి అన్నారు. దేవాలయం కమిటీ అధ్యక్షుడు అంబటి లింగయ్య ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం శివాలయం వద్దకు చేరుకొని బండపై చెక్కి ఉన్న వాటిని పరిశీలించారు.
News November 2, 2025
దేశంలోనే తొలి మహిళా ఈటీవో

రోమీతా బుందేలాకు చిన్నప్పటి నుంచే నీళ్లంటే ఇష్టం. నేవీలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. చివరికి ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్ కోర్సు కనిపించింది. షిప్‌లో పవర్ మేనేజ్‌మెంట్ చెయ్యడం ప్రధాన విధి. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఆ కోర్సు పూర్తి చేశారు. నీళ్ల మధ్యలో నెలల తరబడి సముద్రంలో ఉండాల్సి వచ్చేది. విపరీతమైన ఒత్తిడి. వాటిని దాటి ఎన్నో పదోన్నతులు పొంది ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తినిస్తున్నారు.


