News May 14, 2024

గెలుపోటములపై మహిళా ముద్ర!

image

AP: రాష్ట్ర ఎన్నికల్లో గెలుపోటములను మహిళామణులు శాసించనున్నారు. పార్టీల భవితవ్యం వారి చేతిలోనే ఉందంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో పురుష ఓటర్ల సంఖ్య 2,03,39,851 కాగా.. మహిళా ఓటర్ల సంఖ్య 2,10,58,615గా ఉంది. ఓటర్ల సంఖ్యలోనే కాక పోల్ అయిన ఓట్లలోనూ మహిళలవే అధికం. దీంతో వారు ఎటువైపు మొగ్గితే ఫలితాలు కూడా అటే అనుకూలంగా ఉంటాయన్న అంచనాలున్నాయి. మరి వారి తీర్పు ఎలా ఉండనుందో చూడాలి.

Similar News

News December 8, 2025

రేపు సాయంత్రం నుంచి వైన్స్ బంద్

image

TG: ఈ నెల 11న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా తొలి విడత ఎన్నికలు ఈ నెల 11న 4,236 స్థానాల్లో జరగనున్నాయి.

News December 8, 2025

IIIT-నాగపుర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

image

IIIT-నాగపుర్‌ 6 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్ , పీహెచ్‌డీ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం పీహెచ్‌డీ ఉన్నవారికి రూ.65వేలు, మిగతావారికి రూ.60వేలు చెల్లిస్తారు. దరఖాస్తు చేసిన తర్వాత కాపీని recruitment@iiitn.ac.in ఈమెయిల్‌కు పంపాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iiitn.ac.in.

News December 8, 2025

జనవరిలో దావోస్ పర్యటనకు చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు దావోస్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 23 వరకు అక్కడ ఆయన పర్యటించనున్నారు. దావోస్‌‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు హాజరు కానున్నారు. ఆయన బృందంలో మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. సీఎం తన పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలను కలిసే అవకాశం ఉంది.