News August 3, 2024

World Bank Report: భారత్‌కు 75ఏళ్లు పడుతుందట

image

US తలసరి ఆదాయంలో 1/4 వంతుకు చేరాలంటే భారత్‌కు 75, ఇండోనేషియాకు 70, చైనాకు 10 ఏళ్లు పడుతుందని ప్రపంచ బ్యాంకు రిపోర్టు పేర్కొంది. 75% ప్రపంచ జనాభా ఉన్న 108 మధ్య ఆదాయ దేశాలు సంపన్నంగా మారాలంటే పెరిగే జనాభా, అప్పులు, జియో పొలిటికల్ సవాళ్లను అధిగమించాలని తెలిపింది. చాలా దేశాలు ఫస్ట్‌గేర్ వేసి హై స్పీడులో వెళ్లేందుకు యత్నిస్తున్నాయని, పెట్టుబడుల కోసం గత శతాబ్దపు పాఠాలపై ఆధారపడొద్దని సూచించింది.

Similar News

News December 5, 2025

గూగుల్‌లో ఎక్కువగా వెతికిన అంశాలివే!

image

ఈ ఏడాది ఎక్కువగా శోధించిన అంశాల జాబితాను ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ప్లాట్‌ఫామ్ ‘Google’ రిలీజ్ చేసింది. ‘ఓవరాల్ ట్రెండింగ్ సెర్చ్’ విభాగంలో IPL అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత Google Gemini, Asia Cup, ICC Champions Trophy, Pro Kabaddi League, Maha Kumbh, Women’s World Cup, Grok, Saiyaara, ‘Dharmendra’ గురించి తెగ సెర్చ్ చేసినట్లు తెలిపింది. మరి మీరు ఏ విషయం గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు? COMMENT

News December 5, 2025

IndiGoకే సమస్య ఎందుకు.. ఏం జరుగుతోంది?

image

దేశంలో IndiGo తప్ప మిగతా ఎయిర్‌లైన్స్ సర్వీసులు మామూలుగానే నడుస్తున్నాయి. ఇండిగోకే ఎందుకు సమస్య వచ్చింది? నిజానికి పైలట్లకు వారానికి అదనంగా 12గంటల రెస్ట్ ఇవ్వాలని DGCA ఇటీవల రూల్ తెచ్చింది. అదనపు పైలట్ల నియామకానికి 18నెలల గడువిచ్చింది. ఎయిరిండియా, ఆకాశ, విస్తారా ఈ మేరకు సర్దుబాటు చేసుకోగా, ఇండిగో మాత్రం పట్టించుకోలేదు. 60% మార్కెట్ ఉన్న సంస్థ సిబ్బందిని ఎందుకు నియమించలేదనేది చర్చనీయాంశమవుతోంది.

News December 5, 2025

నేడు ప్రపంచ మృత్తికా దినోత్సవం

image

ప్రపంచ జనాభాకు అందే ఆహారంలో 95శాతం నేల నుంచే అందుతోంది. అందుకే మనిషి ఉనికికి, జీవనానికి మట్టి మూలాధారం. నేల ఆరోగ్యంగా, సారవంతంగా ఉన్నప్పుడే మానవ మనుగడ సాధ్యమవుతుంది. అందుకే భూమి ప్రాధాన్యత, సంరక్షణకు తీసుకోవాల్సి జాగ్రత్తలను వివరించడానికి ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్‌ & అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ఓ తీర్మానం చేసింది. 2014 DEC-5 నుంచి ఏటా ఈ రోజున ప్రపంచ నేల దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.