News April 2, 2024

వరల్డ్ వార్-2 హీరో కన్నుమూత

image

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారత సైన్యంలో ఎంతో అనుభవజ్ఞుడైన సుబేదార్ థాన్సేయా 102 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మిజోరాం రాష్ట్రానికి చెందిన ఆయన గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, మార్చి 31న తుది శ్వాస విడిచినట్లు ఆర్మీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అస్సాం రెజిమెంట్‌కు చెందిన థాన్సేయా.. కోహిమా యుద్ధంలో కీలక పాత్ర పోషించారు.

Similar News

News February 12, 2026

ఇకపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు

image

AP: గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డులుగా మార్చింది. ఇటీవల మంత్రివర్గం తెలిపిన ఆమోదం మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అక్టోబ‌ర్ 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన విషయం తెలిసిందే.

News February 12, 2026

చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

image

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్​లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

News February 12, 2026

రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

TG: రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రేషన్ కార్డులు లేని అర్హులైన వ్యక్తులు ‘మీ సేవ’ కేంద్రాల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. అలాగే పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చవచ్చని తెలిపింది. గత ఏడాది కాలంలో 14.40 లక్షల కొత్త కార్డులు మంజూరయ్యాయని వెల్లడించింది. కాగా 2026 JANకి మొత్తం కార్డుల సంఖ్య 1,04,35,848కు చేరాయంది.