News January 10, 2026
WPL: ఇవాళ డబుల్ ధమాకా

ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్‌లో నేడు రెండు మ్యాచులు జరగనున్నాయి. టోర్నీలో 5 జట్లే పాల్గొంటుండటంతో టీమ్‌లు వరుస రోజుల్లో మ్యాచులు ఆడే పరిస్థితి ఏర్పడింది. నిన్న తొలి మ్యాచులో RCB చేతిలో <<18814463>>ఓడిన<<>> ముంబై ఇవాళ రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎదుర్కోనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే మ్యాచులో గుజరాత్-యూపీ వారియర్స్ తలపడతాయి. హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.
Similar News
News January 23, 2026
వృద్ధాప్యానికి చెక్ పెట్టొచ్చు: ఎలాన్ మస్క్

మరణాన్ని, వృద్ధాప్యాన్ని అడ్డుకోవచ్చని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. వయసుని తగ్గించడం కూడా సాధ్యమేనని అన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఆయన మాట్లాడారు. శరీరంలోని అన్ని భాగాలు ఒకేసారి ముసలితనం వైపు వెళ్తున్నాయంటే దానికి ఒక కారణం తప్పకుండా ఉంటుందన్నారు. అయితే మనిషి ఎక్కువ కాలం జీవిస్తే క్రియేటివిటీ తగ్గి సమాజంలో వచ్చే మార్పులు ఆగిపోవచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు.
News January 23, 2026
INDvsNZ 4వ T20.. టికెట్లు విడుదల

భారత్-న్యూజిలాండ్ మధ్య 28వ తేదీన జరగనున్న 4వ T20కి టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ విశాఖలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో బుధవారం రాత్రి 7గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు district యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.
News January 23, 2026
‘MSVPG’కి పెంచిన టికెట్ ధరల లెక్కలు ఇవ్వండి: HC

TG: చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి వాస్తవ లెక్కలను సమర్పించాలని GST అధికారులను హైకోర్టు ఆదేశించింది. చట్టవిరుద్ధంగా టికెట్ ధరలను పెంచారని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. రూ.45 కోట్లు అక్రమంగా సంపాదించారని, వాటిని రికవరీ చేయాలని పిటిషనర్ శ్రీనివాస రెడ్డి కోరారు. కోర్టు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.


