News June 20, 2024

యశస్విని మళ్లీ స్కూల్‌కు వెళ్లాలి: బీఆర్ఎస్ శ్రేణులు

image

TG: పాలకుర్తి MLA యశస్వినిరెడ్డి కశ్మీర్ లేని ఇండియా మ్యాప్ షేర్ చేశారని BRS శ్రేణులు ఆరోపిస్తున్నాయి. రాహుల్ గాంధీ‌కి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్‌ను ఆమె ట్విటర్‌లో షేర్ చేశారు. ఆ పోస్టర్‌లోని ఇండియా మ్యాప్‌లో కశ్మీర్ లేదని గ్రహించి ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి మరో పోస్ట్ చేశారని విమర్శలకు దిగాయి. దీంతో అసెంబ్లీ కన్నా ముందు ఆమె స్కూల్‌కు వెళ్లాలని సెటైర్లు వేస్తున్నాయి.

Similar News

News September 8, 2024

భారీ వర్షాలు.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

image

ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాలువలు, చెరువులు, డ్రెయిన్లకు గండ్లు పడకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆహారం, తాగునీరు, వైద్యశిబిరాలు ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలన్నారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. జిల్లా స్థాయిలో చేస్తున్న పనులకు తక్షణం నిధులు విడుదల చేస్తామని తెలిపారు.

News September 8, 2024

మీకు తెలుసా: పాస్‌పోర్టుకు 4వేల ఏళ్ల చరిత్ర!

image

పరాయి దేశం వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌పోర్టు ఉండాల్సిందే. ఇప్పుడేే కాదు 4వేల ఏళ్లకు పూర్వమే ఇలాంటి విధానం ఉంది. క్రీస్తుపూర్వం 2వేల ఏళ్లనాటికి చెందిన మెసపొటేమియావాసులు దేశం దాటేందుకు మట్టి పలకల రూపంలో గుర్తింపు కార్డుల్ని తీసుకెళ్లేవారని తవ్వకాల్లో వెల్లడైంది. పురాతన ఈజిప్టు, భారత నాగరికతల్లో లేఖల్ని తీసుకెళ్లేవారు. ఇక ఆధునిక పాస్‌పోర్టుల ప్రస్థానం మాత్రం మొదటి ప్రపంచయుద్ధం సమయంలో మొదలైంది.

News September 8, 2024

ఏలియన్స్‌పై అమెరికా అధ్యయనం: మాజీ అధికారి

image

అమెరికా రక్షణ కార్యాలయంలో పనిచేసిన లూయిస్ ఎలిజోండో అనే అధికారి సంచలన ప్రకటన చేశారు. తమకు చిక్కిన గ్రహాంతరవాసులు, వారి నౌకపై అమెరికా అధ్యయనం చేసిందని వెల్లడించారు. ‘గ్రహాంతరవాసులు, వారి వాహనాలపై అమెరికా పరిశోధనలు జరిపింది. వాటి ఉనికి గురించి దశాబ్దాల క్రితమే తెలిసినా రహస్యంగా ఉంచుతోంది. విశ్వంలో మనం ఒంటరి కాదు’ అని పేర్కొన్నారు. కాగా.. లూయిస్ ఆరోపణలు నిరాధారమైనవంటూ అమెరికా ఖండించింది.