News February 10, 2025
YCPలోకి నగరి MLA సోదరుడు..?

నగరి MLA గాలి భానుప్రకాశ్ సోదరుడు జగదీశ్ YCPలో చేరుతారని సమాచారం. ఆయన తండ్రి ముద్దుకృష్ణమ నాయుడు 2019లో మృతిచెందారు. రాజకీయ వారసుడి విషయంలో అప్పట్లో సందిగ్ధం నెలకొంది. దీంతో చంద్రబాబు ముద్దుకృష్ణమ సతీమణి సరస్వతికి MLC ఇచ్చారు. 2019, 24లో భాను ప్రకాశ్‌కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. అప్పటి నుంచి జగదీశ్ తటస్థంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఈనెల 12న ఫ్యాన్ గూటికి చేరుతారని సమాచారం.
Similar News
News February 19, 2026
బెండలో పేనుబంకను ఎలా నివారించాలి?

బెండ పంటలో పేనుబంక లక్షణాలను గుర్తించిన వెంటనే తగిన నివారణ చర్యలను తీసుకోవాలి. లేకుంటే పంట నష్టం తీవ్రంగా ఉంటుంది. పేనుబంక నివారణకు 100 లీటర్ల నీటిలో అజాడిరక్టిన్(3000 PPM) 300ML కలిపి మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. అయినా ఉద్ధృతి తగ్గకపోతే 100 లీటర్ల నీటిలో థయోమిథాక్సాం 30 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 200mlను కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News February 19, 2026
హై బీపీ.. ఇలా తగ్గించుకోండి!

అధిక రక్తపోటు వల్ల గుండె, మెదడు, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హై BPని అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ‘సోడియం ఎక్కువుండే ఫుడ్ తినొద్దు. పండ్లు, కూరగాయలు, మిల్లెట్స్‌తో కూడిన ఆహారం తీసుకోండి. వ్యాయామం చేయండి. మద్యం అలవాటు ఉంటే మితంగా తాగండి. ధ్యానం/యోగాతో ఒత్తిడి తగ్గించుకోండి. క్రమం తప్పకుండా BP చెక్ చేసుకోండి. మందులు స్కిప్ చేయొద్దు’ అని చెబుతున్నారు.
News February 19, 2026
గజ్వేల్: ‘వ్యక్తిగత పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్ష’

‘వ్యక్తిగత పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్ష’ అని గజ్వేల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ అన్నారు. కాయకల్ప పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు చెందిన టీం లీడర్లు డాక్టర్ విజయ్, డాక్టర్ నీరజ బృందం బుధవారం గజ్వేల్ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులు, రోగులకు అందుతున్న వైద్య సేవలను వారు పరిశీలించి, ఇక్కడి నిర్వహణ చాలా బాగుందని కితాబిచ్చారు.


