News June 4, 2024
ఎన్నికల్లో వైసీపీ ఓటమి.. I-PAC స్పెషల్ ట్వీట్
ఏపీ ఎన్నికలు ఫలితాలు వెలువడిన వేళ I-PAC టీమ్ వైఎస్ జగన్‌కి ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేసింది. ‘2024 AP ఎన్నికలు వైఎస్ఆర్సీపీతో మళ్లీ కలిసి పనిచేసేలా చేశాయి. I-PAC & దాని నిపుణులందరు కలిసి ఎన్నికల్లో గెలుపుకోసం కష్టపడ్డాం. ఫలితం ఎలా ఉన్నప్పటికీ వైఎస్ జగన్ నాయకత్వం అందరికీ స్ఫూర్తి. మాపై ఆయన నమ్మకం ఉంచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని Xలో పోస్ట్ చేసింది.
Similar News
News November 13, 2024
తొలిసారిగా 5 వికెట్లు తీసిన సచిన్ కుమారుడు
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్(25) కెరీర్లో తొలిసారిగా రంజీ ట్రోఫీలో 5 వికెట్లు తీశారు. అరుణాచల్ ప్రదేశ్‌పై జరిగిన ప్లేట్ మ్యాచ్‌లో గోవా తరఫున 25 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టారు. దీంతో తొలిరోజే 84 పరుగులకు అరుణాచల్ ఆలౌట్ అయింది. దీనికి ముందు జరిగిన తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్ అనధికారిక మ్యాచ్‌లో అర్జున్ 9 వికెట్లు తీయడం విశేషం.
News November 13, 2024
BSNL యూజర్లకు శుభవార్త
ఫైబర్ యూజర్ల కోసం IFTV పేరిట BSNL 500కు పైగా లైవ్ టీవీ ఛానళ్లు చూసే అవకాశం కల్పించింది. డేటా, బఫర్ సమస్యలు లేకుండా, క్వాలిటీతో వీటిని వీక్షించవచ్చని తెలిపింది. ఇందుకోసం ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదు. ఆండ్రాయిడ్ 10, ఆపై వెర్షన్లు వాడుతున్న వారు BSNL లైవ్‌టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని చూడవచ్చు. తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో తొలుత ఈ సేవలు ప్రారంభించగా, త్వరలో మిగతా రాష్ట్రాల్లో అమలు చేయనుంది.
News November 13, 2024
ఉద్యోగ వేటలో ఇవి మరవొద్దు!
నైపుణ్యలేమి, రెజ్యూమ్ సరిగ్గా లేకపోవడంతో చాలామంది ఉద్యోగాలు పొందట్లేదు. ఈక్రమంలో గూగుల్ లేదా స్నేహితుడి రెజ్యూమ్‌ను కాపీ చేయడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తిగా అవగాహన ఉన్నదాని గురించి మాత్రమే రెజ్యూమ్‌లో పొందుపరచాలంటున్నారు. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యామని వెనక్కి తగ్గకుండా అడిగిన ప్రశ్నలపై ప్రిపేర్ అవ్వాలని, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలంటున్నారు. ముఖ్యంగా భయపడొద్దని సూచిస్తున్నారు.